చీరల పంపిణీతో పెద్దన్నగా మారిన కేసీఆర్

1926
  1. ఆడపడుచులకు కానుక బతుకమ్మ చీరలు
  2. చీరల పంపిణీతో పెద్దన్నగా మారిన కేసీఆర్
  3. అటు కానుక… ఇటు చేనేతకు చేయూత
  4. 17వేల మగ్గాలపై కొనసాగుతున్న నేత..
  5. మరో 3 వేల మగ్గాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు
  6. ఈసారి 10 రంగులు.. 10 డిజైన్లు
  7. కోటి మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు
  8. సెప్టెంబర్ 15లోపే పంపిణీకి ప్రణాళికలు

 

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మకు తెలంగాణలో ఎనలేని ప్రాశస్త్యం ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్… బతుకమ్మ పండుగను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు… బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి… 18 ఏండ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు వాటిని అందజేస్తున్నారు. తద్వారా సీఎం కేసీఆర్ ఆడపడుచులకు అన్నగా మారారు. రెండేండ్లుగా రెండు మూడు డిజైన్లలో చీరలను పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఈసారి ఏకంగా 10 రంగుల్లో ఆకర్షణీయంగా 10 రకాల డిజైన్లతో చీరలను తయారు చేయిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు చీరలు  పంపిణీ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చీరెల తయారీకి ఆర్డరిచ్చింది. ఒకచీరె 5.5 మీటర్లు, జాకెట్ 80 సెంటిమీటర్ల చొప్పున కోటి మందికి మొత్తం 6.3 కోట్ల మీటర్ల చీరె అవసరం అవుతుంది. తెలంగాణలో కొంత మంది మహిళలు ఎనిమిది గజాల చీరెలను ధరించేందుకు ఇష్టపడుతారు. ఈ డిమాండ్ నేపథ్యంలో ప్రస్తుతం ఎనిమిది గజాల చీరెలను కూడా నేయిస్తున్నారు. ఎనిమిది గజాల చీరెలను 8.2 మీటర్లతో, 80 సెంటీమీటర్లతో జాకెట్‌ను అందిస్తారు. వీరికోసం ప్రత్యేకంగా 10 లక్షల చీరెలను తయారుచేయిస్తున్నారు. ఇప్పటికే నాలుగున్న కోట్ల మీటర్ల చీరెలు తయారు కాగా.. మిగతావి పురోగతిలో ఉన్నాయి.

సిరిసిల్లలోని మగ్గాలపై కార్మికులు నిరంతరం శ్రమిస్తూ వీటిని తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు 17 వేల మరమగ్గాల మీద తయారవుతుండగా.. మరో 3 వేల మగ్గాలను పెంచి చీరెల తయారీని వేగవంతం చేయనున్నారు. ఈ చీరెల తయారీకి ప్రభుత్వం రూ.320 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. సెప్టెంబర్ 28 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభంకానున్న నేపథ్యంలో.. చీరెల పంపిణీని  సెప్టెంబర్ 15 కల్లా పూర్తిచేయాలని  ప్రభుత్వం నిర్ణయించింది.  చీరెల తయారీతో సిరిసిల్లలో కార్మికులకు ఆరునెలలు చేతినిండా పనిదొరుకుతున్నది. దీనివల్ల  కార్మికులకు ప్రతినెలా కనీసం రూ.20 వేలు వేతనంగా అందుతుంది.