జీవ‌న్‌రెడ్డీ… పూట‌కో మాటా ?

360
0
  • జీవ‌న్‌రెడ్డీ… పూట‌కో మాటా ?
  • కాళేశ్వ‌రం ఎందుకు ? తుమ్మిడిహెట్టి కావాలంటావు.
  • జాతీయ హోదా కోసం టీఆర్ఎస్ ఎన్నోసార్లు అడిగింది
  • కాంగ్రెస్ ఒక్క‌నాడైనా కేంద్రాన్ని డిమాండ్ చేసిందా ? 
  • ఆయుష్మాన్ భ‌వ కంటే.. ఆరోగ్య‌శ్రీ‌యే న‌యం
వ‌య‌సు మీద ప‌డుతున్న కొద్దీ జీవ‌న్‌రెడ్డికి మ‌తి కూడా భ్ర‌మిస్తోంది. ఒక‌ప్పుడు జ్ఞాప‌క శ‌క్తికి కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉండే ఆయ‌న‌.. ఇప్పుడు దానికి పూర్తిగా దూర‌మ‌య్యాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు టీఆర్ఎస్ ను విమ‌ర్శించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. తెలంగాణ ప్ర‌భుత్వం వాస్త‌విక అంచ‌నాల‌తో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టింది. ఆర్థిక మాంద్యం నేప‌థ్యంలో ముందు చెల్లించాల్సిన‌వి చెల్లింది.. ఆ త‌ర్వాత కొత్త ప‌థ‌కాలు చేప‌ట్టాల‌ని భావిస్తోంది. అందుకు త‌గిన‌ట్లుగానే ప్ర‌ణాళిక రూపొందించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి స‌రైన చేయూత అంద‌ని కార‌ణంగా ఇంకా మ‌రెన్నో కొత్త ప‌థ‌కాలు అమ‌లు కాకుండా ఉండిపోతున్నాయి.
కాళేశ్వ‌రం గురించి ఇన్నాళ్లూ అవాకులు చెవాకులు పేలిన జీవ‌న్ రెడ్డి ఇప్పుడు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నాడు. అస‌లు కాళేశ్వ‌రం ఎందుకు.. తుమ్మిడిహెట్టి క‌ట్టాల‌ని ఇన్నాళ్లూ డిమాండ్ చేసిన జీవ‌న్ రెడ్డి.. ఇప్పుడు మాత్రం మాట మార్చారు. కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చుకొని ఉంటే.. రూ.60 వేల కోట్లు మిగిలి ఉండేవి క‌దా అంటున్నాడు. కేసీఆర్‌, టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మొద‌టి నుండీ మొత్తుకుంటున్న‌ది కూడా అదే నాయ‌నా. జాతీయ హోదా ఇస్తే కాళేశ్వ‌రానికి పెట్టే డ‌బ్బు ఇత‌ర ప‌థ‌కాల‌కు కేటాయించొచ్చ‌ని కేసీఆర్ భావించారు. అందుకోసం ఎన్నోసార్లు ప్ర‌ధాని మోడీ తోపాటు కేంద్ర మంత్రుల‌ను క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు. కానీ.. కేంద్రం ఏనాడూ ప‌ట్టించుకోలేదు.
అయినా జాతీయ హోదా గురించి ఇప్పుడు మాట్లాడుతున్న జీవ‌న్ రెడ్డీ.. ఏనాడైనా నువ్వుగానీ.. నీ హ‌స్తం పార్టీ నేత‌లు గానీ కాళేశ్వ‌రానికి జాతీయ హోదా ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారా ? అయినాగానీ.. ఎట్ట‌కేల‌కు జాతీయ హోదా గురించి మాట్టాడిన నువ్వు… కాళేశ్వ‌రం గొప్ప ప్రాజెక్టు అని ఒప్పుకోక‌నే ఒప్పుకున్నావులే. ఇక రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మేలు చేసే కేంద్ర ప‌థ‌కాల‌ను మాత్ర‌మే ఇక్క‌డ అమ‌లు చేస్తున్నారు. కేంద్ర అమ‌లు చేస్తున్న ఆయుష్మాన్ భ‌వ కంటే రాష్ట్రంలోని ఆరోగ్య‌శ్రీ ఎంతో మేలు. ఆరోగ్యశ్రీ కోసం ఏడాదికి రూ.1,336 కోట్లను రాష్ట్రం ఖర్చుచేస్తున్నది. కానీ ఆయుష్మాన్ భారత్ ద్వారా రాష్ట్రంలో ఏడాదికి రూ.250 కోట్ల విలువైన వైద్యసేవలే అందుతాయి. ఆరోగ్యశ్రీ ద్వారా 85.34 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలిగితే, ఆయుష్మాన్ భారత్ ద్వారా 26 లక్షల కుటుంబాలకు మాత్రమే మేలుకలిగే అవకాశం ఉన్నది. అందువ‌ల్లే ఇక్క‌డ ఆరోగ్య‌శ్రీ‌ని అమ‌లు చేస్తున్నారు.  ఇక నిరుద్యోగ భృతికి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు పూర్తిఅయిన త‌ర్వాత అమ‌లు చేస్తారు. ఐఆర్‌, పీఆర్‌సీ అన్న‌వి ఉన్న‌త‌స్థాయిలో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని బ‌ట్టి తీసుకునే నిర్ణ‌యాలు. స‌మ‌యానుకూలంగా వాటిపై నిర్ణ‌యం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here