టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌జ‌లే ఓనర్లు

474
0
  • టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌జ‌లే ఓనర్లు
  • కేసీఆర్ కూడా వారికి సేవ‌కుడే
  • ఇష్టారాజ్యంగా మాట్లాడితే కుద‌ర‌దు నాయినీ
  • తొలి హోంమంత్రిగా నీకు అవ‌కాశ‌మిచ్చింది ఎవ‌రు ?
  • నీకూ మంత్రి ప‌ద‌వి ఇవ్వాలి ? నీ అల్లుడికీ ఎమ్మెల్సీ కావాలా ?
నేనే ఓన‌ర్ని, కాదు కాదు.. నేనే ఒన‌ర్ని అంటూ ఈ మ‌ధ్య మాట‌లు బాగా ఎక్కువ‌య్యాయి. దేనికి ఎవ‌రు ఓనరు ? అస‌లు టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌జ‌లే ఓన‌ర్లు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఆ ప్ర‌జ‌ల‌కు సేవ‌కుడే. కానీ.. ప‌ద‌వులు మాకు భిక్ష కాదు.. అని ఒక‌రు.. నేను ప‌నోడ్ని కాద‌ని మ‌రొక‌రు ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు.
తెలంగాణ‌కు  తొలి హోంమంత్రిగా ప‌నిచేసిన నాయిని న‌ర్సింహారెడ్డీ.. నీకు ఆ అవ‌కాశం ఇచ్చింది ఎవ‌రు. ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇచ్చి మ‌రీ నిన్ను హోంమంత్రిని చేస్తే.. కేసీఆర్ గురించి నువ్వు మాట్లాడేది ఇదేనా ?  కూర్చుంటే నిల్చోవ‌డానికే క‌ష్ట‌ప‌డే నువ్వు.. ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా నిల్చొని గెలుస్తావా ? అందుకే కేసీఆర్ నీకు టిక్కెట్ ఇవ్వ‌లేదు. అయినా స‌రే ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నావు.
అప్పుడున్న ప‌ర‌స్థితుల్లో అవ‌కాశం ఉంటే మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పి ఉండొచ్చు. అయితే.. మిగ‌తా వాళ్ల‌కు ఛాన్స్ ఇవ్వొద్దా ? పైగా నీకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాలి.. నీ అల్లుడికి ఎమ్మెల్సీ ఇవ్వాలా ? ఇంకా నీ మ‌నుమ‌డికో కార్పొరేష‌న్ పోస్టు.. నీ కుటుంబంలో ఒక్కొక్క‌క‌రికీ ఒక్కో పోస్టు వ‌ద్దా ? అడ‌గ‌డానికైనా కాస్త సిగ్గుండాలి నాయినీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here