న‌మ్మితే ప్రాణ‌మిచ్చే మ‌నిషి కేసీఆర్‌ హరీశ్​తో విభేదాలు.. ఒట్టి మాటలే

634
0

న‌మ్మితే ప్రాణ‌మిచ్చే మ‌నిషి కేసీఆర్‌

హరీశ్​తో విభేదాలు.. ఒట్టి మాటలే

కేసీఆర్‌.. మంచి పాల‌కుడే కాదు. స‌హృద‌యుడూ సాటి మనిషి క‌ష్ట‌న‌ష్టాలు త‌న‌వి అనుకునే మ‌హ‌నీయుడు. త‌న‌ను న‌మ్మిన వారి కోసం ఏమైనా చేయ‌గ‌ల తెగింపు ఉన్న నాయ‌కుడు. క‌ష్ట‌కాలంలో పార్టీలో ఉండి పోరాడిన వారికి అంద‌లం ఎక్కించారు. విలువైన పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని మాత్రం ఉపేక్షించ‌లేదు. కాంగ్రెస్ నాయ‌కులు మాత్రం ఫేస్‌బుక్‌లో పిచ్చిపోస్టులు పెడుతున్నారు.

న‌రేంద్ర‌ను, కోదండ‌రామ్‌ను, హ‌రీశ్ రావును ప‌క్క‌న‌బెట్టాడ‌ని విమ‌ర్శిస్తున్నారు. న‌రేంద్ర‌పై అప్ప‌ట్లో తీవ్ర‌మైన కేసులు ఉన్నాయి. మాన‌వ అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డిన‌ట్టు ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఇష్టం లేకున్న‌ప్ప‌టికీ పార్టీ నుంచి బ‌హిష్క‌రించాల్సి వ‌చ్చింది. ఇక కోదండ‌రామ్ కాంగ్రెస్‌ను గెలిపించ‌డానికి ఏకంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ భేటీ కావ‌డం అంద‌రికీ తెలిసిందే. న‌మ్మి జాక్ చైర్మ‌న్‌ను చేస్తే కాంగ్రెస్ చంక‌నెక్కిన ద్రోహిని ఎవ‌రైనా క్ష‌మిస్తారా ? అందుకే కేసీఆర్​ ఆయనను పట్టించుకోవడం లేదు.

కేసీఆర్‌కు హ‌రీశ్ కూడా కొడుకు వంటివాడే. హ‌రీశ్‌కు కేటీఆర్‌తో స‌త్సంబంధాలు ఉన్నాయి. హ‌రీశ్ డైన‌మిక్ లీడ‌ర్‌. చాలా ధైర్యంగా నిర్ణ‌యాలు తీసుకుంటాడు. మెద‌క్‌లో తిరుగులేని నాయ‌కుడు. కేసీఆర్కు ఇతడు అత్యంత కీల‌కం. ఒక‌రకంగా చెప్పాలంటే కేటీఆర్‌, హ‌రీశ్‌.. కేసీఆర్‌కు రెండు క‌ళ్ల వంటి వాళ్లు. తెరాస ఎక్క‌డ స‌భ పెట్టినా అన్నీ తానై చూసుకుంటాడు.  త‌న‌కూహ‌రీశ్‌కు మ‌ధ్య ఎటువంటి విబేధాలూలేవ‌ని కేటీఆర్ చాలా ఇంట‌ర్వ్యూల్లో చెప్పాడు. హరీశ్​ను చిన్నప్పటి నుంచి పెంచిపెద్ద చేశాడు. రాజకీయ గురువుగా వ్యవహరించాడు. హరీశ్​ ఎన్నటికీ తెరాసలోనే ఉంటాడు.

ఇక జగన్​తో అనుబంధం గురించి. కృష్ణ, గోదావరి నీళ్లు ఏటా వృథాగా పోతున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలంటే ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే సాధ్యం. అందుకే తరచూ జగన్​తో చర్చలు జరుపుతున్నాయి. ఇందులో కాంగ్రెస్​ నాయకులకు తప్పేం కనిపిస్తుందో అర్థం కావడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here