పిచ్చి ముదిరింది కాంగ్రెస్ నేతలకే.

616
  • పిచ్చి ముదిరింది కాంగ్రెస్ నేతలకే.
  • కాంగ్రెస్ నాయకులందరినీ ఎర్రగడ్డ పంపించాలి.
  • సెక్రటేరియేట్, అసెంబ్లీ భవనాలపై ఎందుకు రచ్చ చేస్తున్నారు.
  • కేసీఆర్ సొంతానికి ఏం కట్టుకోవడం లేదు కదా?.
  • రాష్ట్రానికి ఉపయోగపడే పనులే చేస్తున్నారు కదా?.
  • మీరు అడ్డంగా పడుకున్నా.. కూల్చడం ఆగదు కాంగ్రెస్ నాయకుల్లారా?.

కాంగ్రెస్ నాయకులు తమ ఉనికిని కాపాడుకునేందుకే కింద మీద పడుతున్నారు. మొన్నటివరకు కాళేశ్వరం, సాగునీటి ప్రాజెక్టులు అంటూ రాద్దాంతం చేసిన హస్తం పార్టీ నేతలు.. అక్కడ వీళ్ల పప్పులు ఉడకలేదు. అనుకున్న సమయం కంటే ముందే ప్రాజెక్ట్ పూర్తైంది. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా జనం నమ్మలేదు. దాంతో ఇప్పుడు కొత్త భవనాల మీద పడ్డది కాంగ్రెస్ నాయకుల కన్ను. 30, 40 ఏళ్లు సెక్రటేరియేట్ బిల్డింగులు ఉంటాయని.. ఇప్పుడు కూల్చాల్సిన అవసరం ఏంటని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుల్లారా?. దేశంలో ఎక్కడికైనా వెళ్దాం.. ఇంత దిక్కుమాలిన సెక్రటేరియేట్ బిల్డింగులు ఏ చిన్న రాష్ట్రంలోనైనా చూపిస్తారా?.

ఇరుకు గదులు, సరైన వసతులు లేవు, ఫైర్ సేఫ్టీ లేదు, కార్ పార్కింగ్ లేదు. అతిథులొస్తే.. సరైన మర్యాద చేసే పరిస్థితి లేదు. కలెక్టర్లు, మంత్రులతో రివ్యూలు చేసేకోవాలంటే.. మళ్లీ MCHRDకి వెళ్లాల్సిన పరిస్థితి. ప్రజల్ని కలవాలన్నా.. వారు వెయిట్ చేసేందుకు కాస్త చోటు కావాలన్న లేని పరిస్థితి. ఇవన్నీ గమనించే సీఎం కేసీఆర్ కొత్త భవనాలు కట్టాలని అనుకుంటున్నారు. సమస్యలున్నాయని కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు. కానీ కొత్తభవనాల పేరుతో రాద్దాంతం చేస్తే తమకు పొలిటికల్ మైలేజీ పెరుగుతుందని హస్తం నేతల ప్లాన్. మీరెన్ని కుట్రలు చేసినా.. కొత్త భవనాల నిర్మాణం మాత్రం ఆగదు కాంగ్రెస్ నాయకుల్లారా?.

ప్రభుత్వం ఏమీ ప్రజాధనం వృధా చేయడం లేదు. రాష్ట్ర భవిష్యత్ కోసమే ఏం చేసినా. కొత్త భవనాలు అనేవి కేసీఆర్ సొంతానికి కట్టుకోవడం లేదు. తెలంగాణకు మరో వందేళ్లపాటు ఉపయోగపడేలా అత్యాధునిక హంగులతో సెక్రటేరియేట్, అసెంబ్లీ కట్టబోతున్నారు. కాంగ్రెస్ నాయకులు తలకిందులుగా తపస్సు చేసినా.. కొత్త భవనాల నిర్మాణం ఏడాదిలో పూర్తి చేసి… అక్కడి నుంచే పాలన సాగించనున్నారు సీఎం కేసీఆర్. ప్రజాధనం వృధా అంటూ లొల్లి చేయడం ద్వారా కాంగ్రెస్ సాధించేది ఏమీ ఉండదు. పొలిటికల్ మైలేజీ కోసం పాకులాడినా.. మిమ్మల్ని పట్టించుకునే వారు ఎవ్వరూ లేరు.