ప‌రిస్థితుల‌కు అనుగుణంగానే బ‌డ్జెట్‌

358
0
  • ప‌రిస్థితుల‌కు అనుగుణంగానే బ‌డ్జెట్‌
  • దేశ‌వ్యాప్తంగా మాంద్యం ప్ర‌భావం
  • అయినా సంక్షేమానికి తెలంగాణ ప్ర‌భుత్వం ప్రాధాన్యం
  • ముఖ్య విభాగాల్లో త‌గ్గిన ఆదాయం
  • కేంద్రం నుండి సాయం క‌రువు
  • కేవ‌లం 20 శాత‌మే త‌గ్గిన బ‌డ్జెట్‌
  • ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డ్డాక అంచనాల పెంపు
ఎల్ల‌ప్పుడూ ప్ర‌జా సంక్షేమాన్ని కోరుకునే ముఖ్య‌మంత్రి కేసీఆర్ వాస్త‌వాల‌కు అనుగుణంగా ఈసారి బ‌డ్జెట్‌ను రూపొందించారు. దేశ‌వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెల‌కొంది. దాని ప్ర‌భావం తెలంగాణ‌పై కూడా ప‌డింది. రాష్ట్రంలో ఎక్కువ‌గా ఆదాయం వ‌చ్చే శాఖ‌లైన వాణిజ్య ప‌న్నులు, ఎక్సైజ్ నుండి ప‌న్నుల వ‌సూళ్లు చాలా త‌క్కువగా న‌మోద‌వుతున్నాయి. దీనికితోడు రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌కు ప్ర‌భుత్వం వేల కోట్లు ఖ‌ర్చు చేస్తోంది. గ‌త నాలుగు నెల‌ల్లో జీఎస్టీతోపాటు ఇత‌ర ప‌న్నుల వాటాలో ప్ర‌భుత్వానికి దాదాపు 900 కోట్ల రూపాయ‌లు త‌గ్గింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో కూడా ఆర్థిక ప‌రిస్థితి ఇబ్బంది క‌రంగా మారింది. అందువ‌ల్ల ఈసారి జీడీపీ వృద్ధిరేటులో పతనాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం వాస్తవిక బడ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టింది.
గ‌త ప్ర‌భుత్వాల మాదిరిగా గొప్ప‌ల‌కు పోకుండా త‌క్కువ అంచ‌నాల‌తోనే బ‌డ్జెట్‌ను రూపొందించింది. అయిన‌ప్ప‌టికీ గ‌త ఫిబ్ర‌వ‌రి ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ కంటే కేవ‌లం 35 వేల కోట్ల అంచ‌నాల‌ను మాత్ర‌మే త‌గ్గించింది.  మున్ముందు ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డిన త‌ర్వాత అంచ‌నాల‌ను పెంచుకోవచ్చ‌న్న‌ది ప్ర‌భుత్వ ఉద్దేశ్యం. ఇంత లోటులోనూ ప్ర‌భుత్వం సంక్షేమ కార్య‌క్రమాల‌కు ఏమాత్రం నిధుల‌ను త‌గ్గించ‌లేదు. సాగునీరు, వ్య‌వ‌సాయం, సంక్షేమ ప‌థ‌కాల‌కు పెద్ట‌పీట వేసింది. ప్ర‌భుత్వం ప్ర‌వేశపెట్టిన తాజా బ‌డ్జెట్‌లో సంక్షేమ ప‌థ‌కాలు ఏకంగా రూ.53 వేల కోట్లు కేటాయించింది. ఇక అన్న‌దాత సంక్షేమాన్ని ఎప్పుడూ కోరుకునే ఈ ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ రంగానికి రూ.22 వేల కోట్లు కేటాయించింది. విద్యుత్ రంగానికి గ‌తేడాది కంటే కేటాయింపులు రెండున్న‌ర వేల కోట్ల‌కుపైగా పెంచారు.
అన్ని కోణాల్లో ఆర్థిక పరిస్థితులను అంచనావేసి, ఎలాంటి భేషజాలు లేకుండా వాస్తవాన్ని ప్రతి ఫలించేలా బడ్జెట్ ను రూపొందించారు. ఆర్థిక సంక్షోభం కార‌ణంగా కొంత‌కాలంగా కేంద్రం నుండి జీఎస్టీ ప‌రిహారం కూడా ప్ర‌భుత్వం తీసుకోలేదు. కానీ.. ఇప్పుడు నెల‌కొన్న ఆర్థిక మాంద్యం కార‌ణంగా రెండు నెల‌ల్లో 875 కోట్ల జీఎస్టీ ప‌రిహారం తీసుకుంది. ఈ ప‌రిస్థితుల్లో రాష్ట్రాన్ని క‌ష్టాల నుండి గ‌ట్టెక్కించేందుకు ప్ర‌భుత్వం ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్న‌ది. ముందుగా అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఉన్న బ‌కాయిల‌న్నీ చెల్లించాల‌ని నిర్ణ‌యించింది. అందుకోసం బ‌డ్జెట్‌లో కేటాయింపులు కూడా చేప‌ట్టింది. ఆ త‌ర్వాత కొత్త ప‌నులు చేప‌ట్టాల‌ని భావిస్తోంది. మొత్తంగా మాంద్యం నుండి బ‌య‌ట‌ప‌డేందుకు కేసీఆర్ ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here