బీజేపీ పాలితాలకు అన్నీ ప్రత్యేకమే.. తెలంగాణకు మాత్రం ఏముండవా?.

1867
  • బీజేపీ పాలితాలకు అన్నీ ప్రత్యేకమే.. తెలంగాణకు మాత్రం ఏముండవా?.
  • కేంద్రబడ్జెట్ లో తెలంగాణకు ప్రత్యేకంగా ఏమీ ఉండవంటున్న కిషన్ రెడ్డి.
  • సొంత రాష్ట్రంపై నువ్వే ఇలా మాట్లాడితే.. ఇక కేంద్రం ఏం నిధులిస్తుంది.
  • మిగతా కేంద్ర మంత్రులు వారి సొంత రాష్ట్రాలకు నిధులు తీసుకెళ్లలేదా?.
  • తెలంగాణపై.. ఈ ప్రాంత అభివృద్ధిపై నీకేమాత్రం అభిమానం ఉంది తేలిపోయింది.
  • సొంత రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడుతవా?.
  • నీకు ఓట్లేసిన సికింద్రాబాద్ ప్రజలు సిగ్గు పడుతున్నారు కిషన్ రెడ్డి.

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలంగాణ మొత్తం కోడై కూస్తుంటే.. కేంద్రం ఇచ్చిన పదవిని చూసుకుని ఇంతవాడిని చేసిన సొంత ప్రాంతంపై నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి. కనీసం కేంద్రం ఇచ్చిన విభజన హామీలపై కూడా బడ్జెట్ లో కేటాయింపులు లేవు. అటువంటిది.. కేంద్రప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండి.. ప్రధానిని, ఆర్థికమంత్రిని ప్రశ్నించాల్సింది పోయి.. విమర్శలు చేస్తున్నవారిని తప్పు పట్టడం ఎంత వరకు కరెక్ట్ కిషన్ రెడ్డి. ఏడాదిపాటు కేంద్రం నుంచి నిధులు లేకుండా పాలన సాగించడం ఎలా అన్న సోయి ఉండొద్దా?. సొంత ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే వెనకేసుకొస్తున్నావా?. దీనికి సిగ్గుపడాలి.

బడ్జెట్ లో నిధులు కేటాయించనందుకు రాష్ట్రం నుంచి అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. రైల్వే ప్రాజెక్ట్ లు, విభజన హామీలు, కేంద్ర పథకాలకు నిధులు, ప్రభుత్వ రంగ సంస్థల మెయింటనెన్స్ ఇవన్నీ ఎవరు చేయాలి. వీటి బాధ్యత కేంద్రానిది కాదా?. కేంద్రం చేయాల్సిన పనులు పెండింగ్ పెడితే… రాష్ట్రం అభివృద్ధి ఎలా సాధిస్తుంది. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు.. సొంత ప్రాంతాన్ని కాదని.. పదవి ఇచ్చిన కేంద్రానికి నువ్వు మద్దతు తెలపడం సిగ్గుచేటు. నీకు ఓట్లేసిన సికింద్రాబాద్ ప్రజలు సైతం సిగ్గు పడుతున్నారు కిషన్ రెడ్డి.

నువ్వెంత వెనకేసుకుని వచ్చినా.. కేంద్రబడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న మాట వాస్తవం కిషన్ రెడ్డి. ఇందుకు తగిన మూల్యం మున్సిపల్ ఎన్నికల్లో మీ పార్టీ చెల్లించుకోక తప్పదు. కొత్త రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయాల్సింది పోయి.. ఉన్నవి కూడా కట్ చేస్తే.. ఇక్కడి ప్రభుత్వాలు ఏం కావాలి?. కేంద్ర పదవుల్లో ఉన్నప్పుడు ఈ ఆలోచన నీకెందుకు రావడం లేదు. కనీసం నీ హోంశాఖకు అయినా నిధులు ఇప్పించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు.. కేంద్ర పదవుల్లో ఉండటం దేనికి?. కేంద్రం నుంచి సాయం మాత్రం ఉండదు గానీ.. ఇక్కడ అధికారం మాత్రం కావాలి. ఎలా అధికారంలోకి వస్తారో.. ఎలా సీట్లు తెచ్చుకుంటారో.. టీఆర్ఎస్ చూస్తుంది.