మంత్రివ‌ర్గంలో సామాజిక స‌మ‌తూకం

387
0
  • మంత్రివ‌ర్గంలో సామాజిక స‌మ‌తూకం
  • పోయిన‌సారి మాదిగ‌ల‌కు అవ‌కాశం ఇచ్చారు
  • ఈసారి మాల‌ల‌కు ద‌క్కిన ఛాన్స్‌
  • డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇస్తే నువ్వేం చేశారు రాజ‌య్యా ?
  • అన్ని జిల్లాల‌కు ప్రాతినిధ్యం ఇచ్చిన ఘ‌న‌త కేసీఆర్‌ది
  • ఇచ్చిన మాట ప్ర‌కారం ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కూ కోటు
తెలంగాణ మంత్రివ‌ర్గంలో సామాజిక స‌మ‌తూకాన్ని పాటించారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. అన్ని వ‌ర్గాల‌కు స‌ముచిత ప్రాధాన్యం క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. కానీ.. ఈసారి మంత్రివ‌ర్గంలో మాదిగ‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదేని.. ఇది మాదిగ‌ల‌కు అన్యాయం అంటూ ఎమ్మెల్యే రాజ‌య్య మాట్లాడ‌టం సిగ్గుచేటు. రాజ‌య్యా.. పోయిన‌సారి నీకు ఏకంగా డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇస్తే నువ్వేం చేశావు ? నువ్వు వేసిన నాట‌కాల వ‌ల్లే మంత్రి ప‌ద‌వి ఊడింది క‌దా. అయినా స‌రే.. మీ జిల్లా నుండే మీ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తికే కేసీఆర్ మ‌ళ్లీ ఉప ముఖ్య‌మంత్రిగా అవ‌కాశం క‌ల్పించారు.
ఈసారి మంత్రివ‌ర్గంలో మాల‌ల‌కు అవ‌కాశం క‌ల్పించారు. ధ‌ర్మ‌పురి నుండి కొప్పుల ఈశ్వ‌ర్‌కు ఛాన్స్ ద‌క్కింది. మ‌రి పోయిన‌సారి మాల‌ల‌కు అవ‌కాశం ద‌క్క‌లేద‌ని ఏనాడూ ఈశ్వ‌రో.. లేక మ‌రో నేతో ఎందుకు మాట్లాడలేదు. కేవ‌లం ప్ర‌జా సేవ చేయాల‌నుకునే వారే అలా ఆలోచిస్తారు. నువ్వు పిచ్చి మాట‌లు మాట్లాడింది కాకుండా.. ఇంకా ఎమ్మార్పీఎస్ ఒక్కటే కాకుండా ఇంకా ఎవ‌రైనా మాట్లాడాలి అంటూ రెచ్చ‌గొట్టేలా మాట్లాడ‌టం స‌రికాదు రాజ‌య్యా. క్యాబినెట్‌లో ఉమ్మడి పది జిల్లాలకూ చోటు కల్పించడంతోపాటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓసీలకు ప్రాతినిధ్యం లభించేలా చూశారు.
బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌లకు ఇప్పటికే మంత్రివర్గంలో చోటుకల్పించిన సీఎం కేసీఆర్.. తాజాగా అదే సామాజికవర్గానికి చెందిన గంగుల కమలాకర్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎస్టీ సామాజికవర్గం నుంచి లంబాడీ తెగకు చెందిన సత్యవతి రాథోడ్‌కు స్థానం కల్పించారు. ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో స్థానమిచ్చారు. మంత్రులతోపాటు అదే హోదా అయిన చీఫ్ విప్, విప్‌లను కలిపి చూస్తే రాష్ట్రంలోని అన్ని ప్రధాన సామాజికవర్గాలకు క్యాబినెట్‌లో చోటు లభించింది. బీసీల్లో బ‌లమైన సామాజికవర్గానికి చెందిన గంప గోవర్ధన్‌కు, ఎస్టీల్లో కోయ సామాజిక వర్గానికి చెందిన రేగా కాంతారావుకు, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన బాల్క సుమన్, గువ్వల బాలరాజుకు స్థానం దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here