వాస్త‌వాలు న‌చ్చ‌ని విప‌క్షాలు 

354
0
  • వాస్త‌వాలు న‌చ్చ‌ని విప‌క్షాలు 
  • గొప్ప‌ల‌కు పోవ‌డ‌మే వారికిష్టం
  • రాష్ట్రం, ప్ర‌జ‌లు ఏమైపోయినా ప‌ర్వాలేదా ?
  • కేంద్రం నిధులివ్వ‌క‌పోయినా రాష్ట్రానిదే బాధ్య‌తా?
  • ల‌క్ష‌ల కోట్లు తీసుకొని.. వేల కోట్లు కూడా ఇవ్వ‌రా ?
  • ఐదేండ్ల‌లో తెలంగాణ‌లో రూ.5 ల‌క్ష‌ల కోట్ల‌తో అభివృద్ధి
ఎవడు ఎటైనా పోనీ… ప్ర‌జ‌లు నాశ‌నం కానీ… అభివృద్ధి కుంటుప‌డ‌నీ.. రాష్ట్రం వెన‌క‌బ‌డిపోనీ.. కానీ.. విప‌క్షాల‌కు మాత్రం కావాల్సింది వారి రాజ‌కీయ ల‌బ్ధే. తెలంగాణ ప్ర‌జ‌ల చీత్క‌రింపుల‌కు గురై ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన విప‌క్షాలు కేవ‌లం ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాయి. తాజా బ‌డ్జెట్ త‌ర్వాత కాంగ్రెస్ నాయ‌కులు భ‌ట్టి విక్ర‌మార్క‌, విజ‌య‌శాంతి, సీత‌క్క మాట్లాడిన మాట‌లే దీనికి ఉదాహ‌ర‌ణ‌. కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో 50 ఏండ్ల‌లో ఎప్పుడూ జ‌ర‌గ‌ని అభివృద్ధి కేవ‌లం తెలంగాణ‌లో ఐదేండ్ల‌లోనే జ‌రిగింది. దాన్ని గుర్తించిన ప్ర‌జ‌లు కేసీఆర్ పాల‌న‌కు పెద్ద‌పీట వేశారు. టీఆర్ఎస్ పార్టీని రెండుసార్లు బంప‌ర్ మెజార్టీతో గెలిపించారు.
కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని హ‌స్తం నేత‌లు పిచ్చి కూత‌లు కూయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌లేమంటూ కేసీఆర్  చేతులెత్తేశారంటూ పిచ్చి మాట‌లు మాట్లాడుతున్నారు. బ‌డ్జెట్‌లో ఏకంగా 65 శాతం సంక్షేమ ప‌థ‌కాల కోస‌మే నిధులు కేటాయిస్తే… ప‌థ‌కాలు ఎలా అమ‌లు చేస్తారంటూ కాంగ్రెస్ మాట్లాడ‌టం సిగ్గుచేటు. ఇక కేంద్ర ప్ర‌భుత్వం నిధులివ్వ‌క‌పోడం వ‌ల్లే ఆర్థికంగా లోటు ఉంద‌న్న వార్త‌లు నూటికి నూరుపాళ్లూ స‌త్యం. కానీ భ‌ట్టి మాత్రం… ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. గ‌త ఐదేండ్ల నుండి కేంద్ర ప్ర‌భుత్వానికి రాష్ట్రం నుండి వివిధ ప‌న్నుల రూపంలో వెళ్లిన మొత్తం ఎంతో తెలుసా ? ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 2,72,926 కోట్లు కేంద్రానికి చెల్లించింది.
ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే అధికారికంగా ధ్రువీక‌రించింది. కానీ.. ఈ నిధుల్లో నుండి తెలంగాణ‌కు వ‌చ్చింది కేవ‌లం రూ.31,802 మాత్ర‌మే. అంతేకాదు.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు కూడా పూర్తిగా అందించ‌లేదు కేంద్ర ప్ర‌భుత్వం. ఇంకా ఒక ఏడాదికి సంబంధించిన నిధులు మ‌న‌కు రావాల్సి ఉంది. తెలంగాణ ప్ర‌భుత్వం ఏం చేస్తోంది అంటున్న పిచ్చి కాంగ్రెస్ నాయ‌కులూ.. ఒక్క‌సారి కాగ్ ఇచ్చిన నివేదిక తెప్పించుకొని చ‌దువుకోండి. గ‌త ఐదేండ్ల కాలంలో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌కు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసిన ఖ‌ర్చు రూ.5,37,373 కోట్లు. అదే రాష్ట్రంలో కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అమ‌లు చేసేందుకు రాష్ట్రానికి ఇచ్చి నిధులు కేవ‌లం రూ.31,082 కోట్లు మాత్ర‌మే. వాస్త‌వికమైన ఈ విష‌యాలు మాత్రం విప‌క్షాల‌కు ప‌ట్ట‌వు. కేవ‌లం ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు వారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here