సార్సాల ఘ‌ట‌న‌లో ప్ర‌భుత్వ త‌ప్పేమీ లేదు

436
0
  • సార్సాల ఘ‌ట‌న‌లో ప్ర‌భుత్వ త‌ప్పేమీ లేదు
  • పోడు ముసుగులో కబ్జాలు జ‌రుగుతున్నాయ్‌
  • అందుకే అట‌వీశాఖ అదికారులు జోక్యం చేసుకున్నారు

తెలంగాణ‌లో ఎవ్వ‌రికీ తెలియ‌ని అతిగొప్ప పార్టీ టీజేఎస్ కాగ‌జ్‌న‌గ‌ర్ మండ‌లంలోని సార్సాల వ‌ద్ద గిరిజ‌నులు అట‌వీశాఖ అధికారులపై చేసిన దాడిపై విచిత్రంగా స్పందించింది. దెబ్బ‌లు తిన్న‌ది అధికారులు అయితే వాళ్లే గిరిజ‌నుల‌పై దాడి చేశార‌ని ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. గిరిజ‌నుల భూముల‌ను లాక్కున్నారంటూ దేడ్‌దిమాగ్ మాట‌లు మాట్లాడింది. ఆ ఘ‌ట‌న‌లో అధికారుల త‌ప్పేమీ లేదు. అది పూర్తిగా అట‌వీభూమి.

నిర్దేశిత నిబంధనల ప్రకారమే హరితహారంలో అటవీప్రాంతాల్లో భారీగా మొక్కలు నాటుతున్నారు. కానీ ఎక్కడ అడుగుపెట్టినా అక్కడి స్థానిక రాజకీయనాయకులు గిరిజనులు, ఆదివాసీలు పోడుభూముల ముసుగులో కబ్జాలుచేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. అడ్డుకున్న వారిని చిత‌క‌బాదారు. ఆ ప‌నిచేసింది తెరాస వాళ్లే అయినా ప్ర‌భుత్వం వారిని వ‌దిలేయ‌లేదు. అంద‌రిపైనా కేసులు పెట్టింది. ప్రస్తు తం హరితహారంలో అటవీశాఖ 50 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే స్థానిక నాయకులు కబ్జాదారులకే వంతపాడుతూ దాడులకు ఉసిగొల్పుతున్నారు.

దట్టమైన అడవులలోకి చొరబడి కబ్జాలు చేస్తున్నారు. ఇలాగైతే కొంతకాలానికి అసలు అడవే మిగులదు. రాష్టంలో పచ్చదనాన్ని మొత్తం భూభాగంలో 33శాతానికి పెంచాలన్న సీఎం ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. అందుకే..దాడికి పాల్ప‌డ్డ‌ది తెరాస నాయ‌కుడు అయినా అరెస్టు చేసింది. ఇప్ప‌టికే ల‌క్ష‌లాది ఎక‌రాల అట‌వీభూముల‌ను గిరిజ‌నుల‌కు ఇచ్చింది. క‌బ్జాల‌ను మాత్ర‌మేఅడ్డుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here