కాళేశ్వరంపై ప్రతీ పైసకు లెక్కుంది.

249
0
  • కాళేశ్వరంపై ప్రతీ పైసకు లెక్కుంది.
  • కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఎక్కడైనా చర్చకు సిద్ధమే.
  • అవినీతి అనేది పచ్చి అబద్ధం.. బీజేపీ నాయకుల దుర్మార్గపు ప్రచారం.
  • ప్రాజెక్ట్ పూర్తై…. రేపోమాపో నీళ్లొచ్చేవేళ ఇలాంటి విమర్శలు దేనికి?.
  • కాళేశ్వరానికి పది పైసలు కూడా సాయం చేయని బీజేపీకి….
  • ప్రాజెక్ట్ మీద అసలు మాట్లాడే అర్హతే లేదు.

కాళేశ్వరంలో అవినీతి జరిగిందని.. కన్నెపల్లి వద్ద ఒక్కపంప్ కూడా పనిచేయడం లేదని బీజేపీ నేత రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు. మీ ఆరోపణలు అవాస్తవమని నిరూపిస్తే.. అబిడ్స్ సెంటర్ల ముక్కు నేలకు రాస్తావా రఘునందన్. ఎందుకంటే.. కాళేశ్వరం కింద ఖర్చు పెట్టిన ప్రతీ పైసకు లెక్కుంది. ఎంతో పారదర్శకంగా మూడేళ్లలోనే ప్రాజెక్ట్ పూర్తి చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహిస్తూ అంతా పక్కాగా లెక్కలేసుకుని మరీ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ఆన్ లైన్ టెండర్ల నుంచి పనుల పూర్తి దశ వరకు ప్రతీది పక్కాగా లెక్కగట్టింది సర్కార్.

సీబీఐ కాదు.. వాళ్ల జేజమ్మలతో విచారణ జరిపించినా కేసీఆర్ సర్కారుకు వచ్చే నష్టం ఏమీ లేదు. అయితే.. బీజేపీ హయాంలో కడుతున్న ప్రాజెక్ట్ ల మీద కూడా ఇలాగే సీబీఐ విచారణ జరిపితే బాగుంటుంది రఘునందన్ రావు. ఎక్కడిదాకో ఎందుకు.. పక్క రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్ట్ గుర్తించి కేంద్రమే కడుతున్న పోలవరం ఆడిట్ నిర్వహించండి చాలు. ఎవరు అవినీతి చేశారో ఇక్కడే తేలిపోతుంది. సాగునీటి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు నీరందించాలనే ఏకైక లక్ష్యంతో నిర్మించడం జరిగింది. కానీ.. బీజేపీ నాయకులు మాత్రం కమిషన్ల కోసం ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్నారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ లో కేంద్రమంత్రుల దగ్గర నుంచి రాష్ట్రమంత్రుల దాకా అంతా అవినీతికి పాల్పడ్డవారే.

ఇక కన్నెపల్లి దగ్గర ఏడు పంపులు సిద్ధంగా ఉన్నాయి. మరో ఆరు పంపులు పూర్తి దశకు చేరుకున్నాయి. మూడు పంపుల వెట్ రన్ కూడా ప్రపంచం మొత్తం చూసింది. అయినా.. ఒక్క పంపు కూడా పూర్తి కాలేదని అనడానికి నీకు నోరెలా వస్తుంది రఘునందన్. ప్రాజెక్ట్ పూర్తి దశకు చేరుకుంటే  నవ్వు మాత్రం.. తప్పుడు ప్రచారంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. ఇప్పుడు రా కన్నెప్లలి పంప్ హౌజ్ దగ్గరకు ఎన్ని మోటార్లు సిద్ధంగా ఉన్నాయో చూపిస్తాం. హైదరాబాద్ ఆఫీసుల్లో కూర్చుని బురద జల్లడం కాదు. ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్తే తెలుస్తుంది పరిస్థితి ఏంటనేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here