డ్యూటీకి ఎగ్గొడితే ఆర్టీసీ బాగుపడుతుందా?

257
0

 

  • ఆర్టీసీ బాగుపడాలంటే ఇలాగేనా అశ్వత్థామరెడ్డి
  • డ్యూటీకి ఎగ్గొడితే ఆర్టీసీ బాగుపడుతుందా?
  • అనుమతి తీసుకోకుండా డ్యూటీకి ఎగ్గొట్టడం దేనికి నిదర్శనం
  • నీలాంటి వాళ్ల వల్లే ఆర్టీసీకి చెడ్డపేరు
  • ఆర్టీసీ ఏమన్నా నీ అయ్య జాగీరు అనుకున్నావా అశ్వత్థామరెడ్డి
అశ్వత్థామరెడ్డి… అరె.. ఈపేరు ఎక్కడో విన్నట్టుందే అంటారా? ఆ మధ్య ఆర్టీసీ సమ్మె అంటూ ఆర్టీసీ కార్మికుల పొట్ట కొట్టాలని చూశాడు కదా.. ఆయనే. ఆర్టీసీ బాగుపడాలని, ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచాలని.. ఏదో గప్పాలు కొట్టాడు కదా. కానీ..చివరకు ఆయన అసలు బాగోతం ఏందో బయటపడింది. గత నెల రోజుల నుంచి అశ్వత్థామరెడ్డి డ్యూటీకే వెళ్లడం లేదు. ఆర్టీసీ అధికారులు ఆయనకు సెలవులు ఇవ్వకపోయినా… ఆర్టీసీ నా జాగీరు అనుకున్నాడో ఏమో… లేదా ఆయన అయ్య జాగీరు అనుకున్నాడో… డ్యూటీకే వెళ్లడం లేదు.
దీంతో విసుగెత్తిన ఆర్టీసీ అధికారులు ఆయనకు చార్జిషీట్ జారీ చేశారు. అనుమతి తీసుకోకుండా డ్యూటీకి రాకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ చార్జిషీట్ లో పేర్కొన్నారు. ఇది ఆయన అసలు రూపం. ఆర్టీసీ కార్మికులను రోడ్డుపైకి తీసుకొచ్చి రచ్చ రచ్చ చేసి.. పండుగల పూట ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసిన అశ్వత్థామరెడ్డి.. తను మాత్రం డ్యూటీ ఎగ్గొట్టి జల్సాలు చేస్తున్నాడు. నెల రోజులుగా డ్యూటీ ఎగ్గొట్టి ఆయన చేసే పని ఏంటో మరి. కనీసం అనుమతి తీసుకోకుండా డ్యూటీ ఎగ్గొడితే చర్యలు తీసుకుంటారని తెలిసి కూడా ఆయన డ్యూటీకి హాజరుకాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆర్టీసీలో ఇటువంటి వాళ్లు ఉంటే.. ఇక ఆర్టీసీ ఎక్కడ లాభాల్లో ఉంటుంది. లాభాల మాట పక్కన పెట్టండి. కనీసం.. ప్రయాణికులైనా ఆర్టీసీని నమ్మే పరిస్థితి ఉండదు. జీతాలు పెరగాలి కానీ.. ఆర్టీసీ లాభాల కోసం మేం పనిచేయం అంటే.. ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది. 24 గంటలు బస్సులు నడిచినా.. రోజుకు కోట్లలో నష్టం.. మరి ప్రభుత్వం ఇంకా ఎన్నిరోజులు ఆర్టీసీని మోయాలి. అశ్వత్థామరెడ్డి లాంటి వాళ్లు తమ స్వార్థం కోసం ఆర్టీసీని, కార్మికులను బలిపశువులను చేస్తున్నారు. ఆ విషయాన్ని ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. లేదంటే తెలంగాణలో ఆర్టీసీ ఇక కనుమరుగైనట్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here