- వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న భారతీయ జనతా పార్టీ…
- మత స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను తుంగలో తొక్కుతున్న కమలనాథులు…
- ప్రజా విశ్వాసం కోల్పోయి, దేశవ్యాప్తంగా తిరస్కారానికి గురవుతున్న బిజెపి…
- సీఎం కేసీఆర్ పాలన ను ఆదర్శంగా తీసుకుంటే శ్రీరామరక్ష..
- లేకుంటే చరిత్ర కాలగర్భంలో కలవక తప్పదని బిజెపి తెలుసుకోవాలి…
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అనే మాట నిజంగా వాస్తవమనే చెప్పాలి. రానురాను దేశాన్ని నియంతృత్వ ధోరణి లోకి భారతీయ జనతా పార్టీ తీసుకెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ప్రజల భావప్రకటన స్వేచ్ఛతో పాటు మత స్వేచ్ఛను కూడా బిజెపి మంట కలుపుతుంది అనడంలో ఎలాంటి సందేహాలకు తావులేదు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఆఉద్యమిస్తున్న వారిని అనవసరంగా జైల్లో పెట్టి వారిని నానా రకాలుగా హింసకు గురి చేసిన భారతీయ జనతా పార్టీ వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు సహా అన్ని పక్షాలు దేశవ్యాప్తంగా ఈ ప్రమాదకర వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రశ్నించే తత్వాన్ని బొందపెట్టాలని చూసిన ఎంతో మంది చక్రవర్తులు రాజులు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు అనే సంగతిని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎంత త్వరగా తెలుసుకుంటే మంచిది.
దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉండాలని, కాషాయ జెండా మాత్రమే ఎగరాలని మిగతా పార్టీలను ఇరుకున పెట్టేలా అస్థిరమైన చర్యలకు పాల్పడుతున్న భారతీయ జనతా పార్టీ నేతలు ప్రజల చేతుల్లో భంగపాటుకు గురవ్వక తప్పదు. ప్రజలు మీకు వరుసగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీ ఇచ్చింది దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని కానీ రాతియుగపు పాలనను తిరిగి తేవాలని కాదని గుర్తించాలి.
దేశవ్యాప్తంగా అన్ని రంగాలలో ప్రైవేటీకరణ చేస్తూ దేశాన్ని టోకున అమ్మాలని చూసిన పార్టీ నేతలకు త్వరలోనే ప్రజలు తగిన బుద్ది చెబుతారు. ఇప్పటికే ప్రజా విశ్వాసం కోల్పోయి దేశంలోని అనేక రాష్ట్రాల్లో బిజెపి పార్టీ తుడిచిపెట్టుకు పోయింది అని గ్రహించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి చేసిన పాలనను ఆదర్శంగా తీసుకొని నడిస్తే మంచిది. లేకపోతే బీజేపీ పార్టీ అడ్రస్ గల్లంతు కాక తప్పదు అని తెలుసుకోవాలి. తస్మాత్ జాగ్రత్త.