కేసీఆర్ ప్ర‌భుత్వం వారి మంచినే కోరుకుంటున్న‌ది

779
  • కార్మికుల‌కు అస‌లు శ‌త్రువు మీరే మంత్రిగారూ!
  • కేసీఆర్ ప్ర‌భుత్వం వారి మంచినే కోరుకుంటున్న‌ది
  • క‌క్ష సాధిస్తున్నారన్న కిష‌న్ రెడ్డి వ్యాఖ్య‌లు పూర్తిగా అబ‌ద్దాలు

కాంగ్రెసోళ్ల మాదిరే బీజేపీ నాయ‌కుల‌కు కూడా మెద‌డు మోకాళ్ల‌లో ఉంటుంది. ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటార‌న్న సోయి కూడా ఉండ‌దు బీజేపీ స‌న్నాసుల‌కు. మంత్రిస్థాయిలో ఉన్న నాయ‌కుడు కూడా నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతూ త‌న స్థాయిని త‌గ్గించుకుంటున్నాడు. ఆర్టీసీ కార్మికుల‌ను కేసీఆర్ వేధిస్తున్నాడ‌ని కిష‌న్ రెడ్డి అనే కేంద్రమంత్రివ‌ర్యుడు వక్కాణించారు. కార్మికుల‌ను వేధించే సీఎమ్మే అయితే వారికి అందరికంటే ఎక్కువ జీతాలు ఇస్తాడా ? ఐఆర్‌, బోన‌స్‌లు, ఫిట్‌మెంట్లు ఇస్తాడా ? క

కొత్త బ‌స్సులు కొనుక్కోండిరా బాబూ అని డ‌బ్బులు ఇస్తాడా ? గ‌త ఐదేళ్ల‌లో ఆర్టీసీకి ఈ ప్ర‌భుత్వం వేల కోట్ల రూపాయ‌లు ఇచ్చిన మాట నిజం కాదా కిష‌న్ రెడ్డి ? నీ గుండె మీద చెయ్యేసి చెప్పు.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయ‌మైన‌వేనా ?  వారిని ఎగ‌దోస్తున్న‌ది మీరు కాదా ? స‌మ్మె పేరు చెప్పి కేసీఆర్ స‌ర్కారుకు చెడ్డ‌పేరు తీసుకున్న రావ‌డానికి మీరు కాంగ్రెస్‌తో కుమ్మ‌క్కుకావ‌డాన్ని అంద‌రూ చూస్తేనే ఉన్నారు. మీ స్వార్థం కోసం రాజ‌కీయ అవ‌స‌రాల కోసం స‌మ్మెను ఎగ‌దోస్తున్న‌రు. ప్ర‌జ‌లు, కార్మికుల జీవితాల‌తో ఆట‌లాడుకుంటున్న‌రు.

సమ్మె అనేది కార్మికుల సంక్షేమానికి వాడాల్సిన ఒక ఆయుధం. కానీ కొందరు కార్మికసంఘాల నాయకులు తమ సంక్షేమం, పరపతిని పెంచుకునే దురుద్దేశంతో సమ్మెను సాధనంగా ఉపయోగించుకుంటున్నారు.  ఇలాంటి సమ్మె ద్వారా ఎలాంటి డిమాండ్లు పరిష్కారం కావు. కార్మికసంఘాల నాయకులు, మీ పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలుచేస్తూ ప్రభుత్వాన్ని లక్ష్యంచేసుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులను రెచ్చగొడుతున్నారు. ఏర‌కంగా చూసినా ఆర్టీసీకి మొద‌టి, చివ‌రి శ‌త్రువులు మీరే అవుతారు కిష‌న్‌రెడ్డిగారు. ఆ విష‌యం మీ మ‌న‌సుకు తెలుసు కానీ బ‌హిరంగంగా ఒప్పుకోలేరు.