బీజేపీ తప్పుటడుగు

422

 

బీజేపీ తప్పుటడుగు

బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటోంది. ఈ క్రమంలో పార్టీని సొంతంగా బలోపేతం చేసుకోవడంపై కాకుండా…ఇతర పార్టీల నుంచి నేతలను దిగుమతి చేసుకోవడంపై ద్రుష్టి పెట్టింది. నేతలు పార్టీలు మారడం అనేది రాజకీయాల్లో సహజమైన విషయమే.

అనేక మంది నాయకులు వ్యక్తిగత కారణాలతో, అసంత్రుప్తులతో పార్టీ మారుతుంటారు. రాజకీయ భవిష్యత్ కోసం…కండువాలు మార్చేస్తుంటారు. అయితే ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ దగ్గర చేర్చుకునేముందు వారి నేపథ్యం, అనుభవం, ప్రజాసేవపై వారికున్న చిత్తశుద్ధి వంటి వాటిని ఎవరైనా పరిశీలించడం సహజం. కానీ బీజేపీ మాత్రం టీఆర్ఎస్ పై గుడ్డి వ్యతిరేకతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. శత్రువుకు, శత్రువు..తనకు మిత్రుడు అన్న చందంగా వ్యవహరించాల్నది బీజేపీ వ్యూహం అయినప్పటికీ..అది మొదటికే మోసం తెస్తుందని కమలనాథలు గ్రహించలేకపోతున్నారు.

ఈటల విషయంలో ఇలాగే తప్పులో కాలేస్తున్నారు కాషాయ నేతలు. ఆత్మగౌరవం గురించి పదే పదే మాట్లాడే ఈటల రాజేందర్…పేదల భూములను ఆక్రమించుకుని, వాటిపై లోన్లు తీసుకుని ప్రజల ద్రుష్టిలో దోషిగా ముద్రవేయించుకున్నారు. అక్రమార్జన కోసం దేవాలయ భూములను సైతం ఆక్రమించుకున్న ఈటలను చూసి రాష్ట్ర ప్రజలు ఉలిక్కిపడ్డారు. అవినీతి బాగోతం బయకు రావడంతో…సీఎం కేసీఆర్ ఈటలపై చర్యలు తీసుకున్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈటల ఇలాంటి సమయంలో తనపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ప్రయత్నించకుండా..కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అండ కోసం పాకులాడుతున్నారు. ఎక్కే గడప, దిగే గడప చందంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా చక్కర్లు కొడుతున్నారు.చివరాఖరకు బీజేపీలో జాయిన్ అయ్యారు 

బీసీ మంత్రి ముసుగులో ఆయన వేల కోట్లు వెనకేసుకున్నారని వస్తున్న ఆరోపణలు నిజమేనని చెప్పడానికి ఈటల వ్యవహారశైలే నిదర్శనం. మరోవైపు బీజేపీ కూడా…ఇలాంటి అక్రమార్జన నేతలే తమకు కావాలనుకోవడం చూస్తే…నేతల సచ్ఛీలతతో ఆ పార్టీకి పనిలేదనిపిస్తుంది. అయితే తెలంగాణ ప్రజల ఆస్తులను అందినకాడికి దోచుకుని…టీఆర్ఎస్ కు నమ్మకద్రోహం చేసిన ఈటల…ఏదో  ఓ రోజు బీజేపీకి అదే తరహా అనుభవం రుచిచూపిస్తారు. అప్పటికి గానీ కమలనాథులకు తత్త్వం బోధపడదు.