చదవండి .. వెంటిలేటర్ల బాగోతం కేంద్రం పంపినవన్నీ చీప్ వెంటిలేటర్లు అవి సరిగ్గా పనిచేయడం లేదు

283

మీరు గమనించండి.

బీజేపీ వాళ్లు ప్రతిరోజూ వెంటిలేటర్ల గురించి మాట్లాడుతున్నారు. కేంద్రం వందల కొద్దీ వెంటిలేటర్లను కోట్ల కొద్దీ రూపాయలు పెట్టి కొని పంపితే తెలంగాణ గవర్నమెంటు వాడుకోవడం లేదని తెగబాధపడిపోతున్నరు. బండి సంజయ్ కండ్ల నుంచి లీటర్ల కొద్దీ నీళ్లు వస్తున్నయి. వెంటిలేటర్లు నిరుపయోగంగా పడి ఉన్నయ్… అవి ఉంటే చాలా మంది బతికేవాళ్లు అని కన్నీళ్లు పెట్టుకుంటున్నడు. ఈ దయలేని కేసీఆర్ వాటిని ఇన్స్టాల్ చేయించడం లేదని కోపంతో ఊగిపోతున్నడు. వెంటిలేటర్ల గురించి నిజాలు తెలుసుకుంటే మన గుండె ఆగిపోతుంది. వాస్తవం ఏంటంటే ఇండియాలో ఏ ఒక్క కంపెనీకి వెంటిలేటర్ తయారు చేసే కెపాసిటీ లేదు. అవి ఫారిన్ నుంచి రావాల్సిందే! కరోనా కేసులు అంతటా ఉన్నాయి కాబట్టి వెంటిలేటర్లను ఫారిన్ కంట్రీస్ కూడా అమ్మడం లేదు.
దీంతో మోడీ ప్రభుత్వం అతితెలివికి పోయింది.

మేక్ ఇన్ ఇండియా అంటూ ఎచ్చులకు పోయి లోకల్ కంపెనీలతో వెంటిలేటర్లను తయారు చేయించింది. మొదట జ్యోతి ఐఎన్సీ అనే కంపెనీ వీటిని తయారు చేసి కేంద్రానికి ఇస్తే కేంద్రం అన్ని రాష్ట్రాలకు పంపింది. వీటిలో రకరకాల సమస్యలు ఉండటంతో దాదాపు అన్ని ఆస్పత్రులు మూలనపడేశాయి. వీటికి ఉన్న ఆక్సిజన్ మాస్కులు బాలేక సక్రమంగా పనిచేయలేదు. తయారీదారులు ఆస్పత్రులకు టెక్నికల్ హెల్ప్ చేయడం లేదు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ‘మేక్ ఇన్ ఇండియా’ వెంటిలేటర్లు సరైన రీతిలో పనిచేయడం లేదని జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చాయి. వాటిలో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని పేర్కొన్నాయి. వీటిని ఇన్స్టాల్ చేయడం లోకల్ టెక్నీషియన్లకు సాధ్యం కావడం లేదు.

వెంటిలేటర్లకు పవర్ సప్లే చేసే ప్లగ్స్ దొరకడం లేదు. మెయింటెనెన్స్, సర్వీస్ చేసేవాళ్లే లేరు. డెమో ఇవ్వలేదు. తయారీదారుల్లో చాలామంది మొదటిసారి వెంటిలేటర్లను రూపొందించినవాళ్లే! అంటే జస్ట్ ఒక ప్రయోగం చేశారు!! వెంటిలేటర్ నమూనాలకు కఠినమైన పరీక్షలు పెట్టలేదు. సర్టిఫికేషన్లు లేవు. డొమైన్ నాలెడ్జ్ నిపుణులు చెక్ చేయలేదు. అందుకే వెంటిలేటర్లను అందుకున్న చాలా రాష్ట్రాలు వాటిని వారి ఆసుపత్రులలో ఇన్స్టాల్ చేయలేదు. దీంతో 2021 ఏప్రిల్ 11 న కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అటువంటి ఏడు రాష్ట్రాలకు లేఖ రాశారు. గత 4-5 నెలలుగా 50 కి పైగా వెంటిలేటర్లు నిరుపయోగంగా పడిఉన్నాయని, వెంటిలేటర్ల ఇన్స్టలేషన్ను వేగవంతం చేసి, సమర్థంగా ఉపయోగించుకోవాలని కోరారు. అయినా ఆస్పత్రులు పట్టించుకోనిది ఇందుకే! ఔరంగాబాద్ మెడికల్ కాలేజీకి జ్యోతి సీఎస్సీ 150 వెంటిలేటర్లను సరఫరా చేసింది. 100 వెంటిలేటర్లు మొదటిసాసారి 2021 ఏప్రిల్ 19 న ఔరంగాబాద్ చేరుకున్నాయి. తరువాత రాష్ట్ర అధికారుల నుండి వచ్చిన సూచనల ప్రకారం ఇన్స్టలేషన్ జరిగింది. మొదటి లాట్‌లోని 100 వెంటిలేటర్లలో 45 వెంటిలేటర్లను మెడికల్ కాలేజీల్లో ఏర్పాటు చేశారు.

ఈ వెంటిలేటర్లకు సంబంధించి ఇన్స్టలేషన్ ,పనితీరు బాలేదని డాక్టర్లు స్పష్టం చేశారు. వీటిలో ఫ్లో సెన్సార్ (ప్రాక్సిమల్) సరిగ్గా ఇన్స్టాల్ కావడం లేదు. ఆక్సిజన్ సెల్స్ సక్రమంగా పనిచేయడం లేదు. ఎన్‌ఐవి (నాన్-ఇన్వాసివ్ (బిపాప్) మోడ్‌లో రోగి శాచురేషన్ను నిర్ధారించలేకపోతున్నాయి. అవసరమైనంత పిఇఇపి రావడం లేదు. కొన్నిసార్లు అధిక లీకేజీ గురించి పరికరాలు నిరంతరం అలారం ఇస్తున్నాయి. వెంటిలేటర్ తయారుచేసే హెల్ప్‌లైన్ నంబర్లను తెలియజేస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు , కేంద్ర పాలిత ప్రాంతాలకు 2021 మే 9 న లేఖ రాసింది. ఇవి వెంటిలేటర్లకు అంటించిన స్టిక్కర్లపైన కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ ఎవరూ రెస్పాండ్ కావడం లేదు. ఇన్ని సమస్యలు ఉన్న వెంటిలేటర్లను ఎవరైనా వాడుతారా ? కేంద్రం ఇచ్చింది కదా అని గుడ్డిగా ఇన్స్టాల్ చేసి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటం న్యాయమా ? మంచి ఎక్విప్మెంట్ అయితే వాడుకోవడానికి అభ్యంతరం ఎందుకు ?