కరోనాపై సమరభేరీ కి సైరన్ మోగించిన తెలంగాణ ప్రభుత్వం. 

128
0
  • కరోనాపై సమరభేరీ కి సైరన్ మోగించిన తెలంగాణ ప్రభుత్వం. 
  • నివారణ చర్యలు పాటిస్తూనే అవగాహన కల్పించేందుకు రోడ్మ్యాప్ ప్రిపేర్ చేసిన ప్రభుత్వం. 
  • కరోనా కట్టడి ని తెలుసుకునేందుకు కేరళకు సైతం వెళ్లనున్న తెలంగాణ టీం. 
కరోన మహమ్మారి పై పోరాడడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రశ్చన్న యుద్ధం మొదలు పెట్టింది.కరోన పై పోరాడడానికి ఏకంగా ఐదు కమిటీలను తెలంగాణ ప్రభుత్వం నియమించడం జరిగింది.ఖచ్చితమైన నివారణ చర్యలు పాటిస్తూనే తెలంగాణ ప్రజల్లో అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు రూపొందించింది.ఇదే సమయంలో ఫేక్ న్యూస్ ని  ప్రచారం చేసే ఆకతాయిలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో గట్టి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కోఠీ లో ఏకంగా కరోన కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడంతోపాటు ఒక్కొక్క జిల్లా నుంచి 10 మంది పారా మెడికల్ సిబ్బందిని నియమించడం కూడా జరిగింది.
కరోన సోకిన వ్యాధిగ్రస్తుని కి ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే వైద్యం అందించాలని ఒప్పందంతో ప్రైవేటు సంస్థలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.సరైన ఐసోలేషన్ పద్దతిని పాటిస్తూ వ్యాధిని ఇంకా ప్రబలకుండా చేయడానికి అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది అని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు పేర్కొనడం జరిగింది. కేసిఆర్ గారి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఎటువంటి చింత లేకుండా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి గారు చెప్పడం జరిగింది.అక్కడితో ఆగకుండా కరోన వ్యాధి ని కట్టడి చేయడానికి కోసం కేరళకు సైతం తెలంగాణ ప్రభుత్వం ఒక బృందాన్ని పంపించడం నిజంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా పేర్కొనవచ్చు అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here