కరోన లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ టంచనుగా రైతుబంధు సాయం. 

519
కరోన లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ టంచనుగా రైతుబంధు సాయం. 
విత్తనాలను నకిలి చేసే వాళ్ళ పై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఆదేశం. 
క్యూఆర్ కోడ్ లాంటి సాంకేతికతను ఉపయోగించి ట్రాన్స్పరెన్సీ కి తలుపులు తీసిన సీఎం. 
 
 
దేశం మొత్తం కరోన మహమ్మారి దాటికి విలవిలలాడుతున్న సమయంలో అన్నం పెట్టే రైతుకు అండగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు అనుకున్న సమయానికి రైతుబంధు సాయాన్ని రైతులకు అందాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. వివాదాల్లో ఉన్న భూములను వివాదాలు లేకుండా చేసే లిస్టులో వేయడానికి జూన్ 10 ని డెడ్ లైన్ గా పెట్టి జూన్ 15 నుంచి జూన్ 25 వరకు రైతుబంధు సాయం రైతులకు అందాలని నిర్ణయించడం జరిగింది.రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుబంధు సాయాన్ని అనుకున్న సమయానికి రాష్ట్ర ప్రభుత్వం అందించడం పట్ల రాష్ట్ర రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. 
 
 
మరోవైపు నిన్న క్యాబినెట్ సమావేశం నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం. విత్తనాలు నకిలీ చేసే వారిపై ఉక్కుపాదం తో అణచివేయాలని ఆదేశించడం జరిగింది. ఎవరైనా నకిలీ విత్తనాలు తయారు చేసి ఉంటే వాళ్ళని పట్టుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడంతోపాటు ప్రత్యేక గుర్తింపు కూడా ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది.ఒకవేళ వ్యవసాయ అధికారులు తప్పులకి పాల్పడితే వాళ్లను సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు ఏకంగా ఐదు సంవత్సరాల పంపించడం జరుగుతుంది అని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 
 
వ్యవసాయ దిగుబడులు ఈసారి కూడా అన్ని రాష్ట్రాలను పక్కకునెట్టి తెలంగాణ రాష్ట్రం ముందువరుసలో ఉండాలని సీఎం కేసీఆర్ గారు బలంగా కోరుతున్నారు దానికి అనుగుణంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం కాకుండా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి క్యూఆర్ కోడ్ లాంటి మాధ్యమాలను ఉపయోగించి పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించడం జరిగింది.కరోన కాలంలోనూ రైతులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ రైతులందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 
 
 
కరోనా విపత్తు వేళ కూడా రైతుబంధు పథకం నిధులు విడుదల చేయడంపై రైతాంగం అందరూ సీఎం కేసీఆర్కు రుణ పడ్డారని పలువురు పేర్కొంటున్నారు.  
ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడిందని తమ సొంత కాళ్లపై తాము నిలబడేలా రైతులకు ఇది ఉపకరించగలదు అని అభిప్రాయపడుతున్నారు. ఒక రైతు కుటుంబంలో పుట్టి స్వయంగా రైతు అయినా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆలోచనలకు ప్రతిరూపమే రైతుబంధు పథకం అని ప్రజలు కొనియాడుతున్నారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దూసుకెళుతోందని ఇలాంటి నేపథ్యంలోనే ఈ పథకాలకు రూపకల్పన జరిగింది అని జనం ప్రశంసిస్తున్నారు. ఏటా పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర చిక్కిన ఎందరో రైతులు తమ జీవితాలను నాశనం చేసుకున్నారని, ప్రభుత్వం తాజాగా అందించే సహాయం ద్వారా సొంతంగా వ్యవసాయం చేయనున్నారని అభిప్రాయపడుతున్నారు.  
 
 
తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి మెజార్టీ స్థానాలు కట్టబెట్టిన ప్రజల రుణం తీర్చుకునే క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి విప్లవాత్మక చర్యలు చేపట్టిందని విశ్లేషకులు అంగీకరిస్తున్నారు. రైతు బంధుమాత్రమేగాకుండా రానున్న రోజుల్లో ఇంకా చాలా పనులు కేసీఆర్ ఆలోచనలో ఉన్నాయని అవి త్వరలో కార్యరూపం దాల్చనున్నాయని తెలుస్తోంది. ఏదేమైనా సంక్షేమ పథకాలతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కేసీఆర్ నుంచి ఇలాంటి పథకాలు మరిన్ని రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అదే రైతులకు మంచి జరుగుతుందని మరోసారి నిరూపించినట్టు అయింది.