నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమా….?

396

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడేల్ల కాలంలో లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించింది ప్రభుత్వం. కరోనా కల్లోల కాలంలోనూ….మరో 50వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తోంది. సెకండ్ వేవ్ వ్యాప్తి లేకపోతే..ఈ సమయానికే ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడి ఉండేది. కరోనా పరిస్థితులు నియంత్రణలోకి రాగానే…ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

దేశాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో లెక్కచెప్పే ధైర్యం ఆ పార్టీ నేతలకు లేదు కానీ…ఇప్పుడు మాత్రం నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ…నిరుద్యోగుల్లో అసంత్రుప్తి పెంచి పోషిస్తూ…వారిలో ఆత్మహత్యల ఆలోచనలు కల్పిస్తున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ అంటున్నారు.

కానీ ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఒకేసారి అన్ని పనులూ జరిగిపోవు. కాలక్రమేణా..ఒక్కొక్కటిగా కన్న కలలన్నీ సాకారం అవుతాయి. 50ఏల్ల ఉమ్మడి పాలన మిగిల్చిన చీకటి గుర్తులను చెరిపివేస్తూ…రాష్ట్రాన్ని వెలుగులవైపు నడిపిస్తున్నారు సీఎం కేసీఆర్. 50 ఏల్ల కాలంలో జరిగిన అన్యాయం ఒక్కరోజులో సరిదిద్దలేం అన్న సంగతి తెలంగాణ ప్రజలందరూ అర్ధం చేసుకున్నారు కాబట్టే ప్రజలంతా సీఎంకు అండగా ఉంటున్నారు. 

నిజానికి హామీ ఇచ్చిన దాని కన్నా పెద్ద సంఖ్యలోనే తెలంగాణ ప్రభుత్వం…ఉద్యోగాలు కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా…ఏడేల్ల కాలంలో లెక్కకు మించిన సంఖ్యలో నిరుద్యోగులు ఐటీ వంటి రంగాల్లో ఉపాధి పొందారు. మరోసారి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి…కొత్త నోటిఫికేషన్ ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో నిరుద్యోగులంతా భవిష్యత్తుపై ఎంతో ఆశావహ ద్రుక్పథంతో ముందుకెల్తున్నారు.

అదే విదంగా తెలంగాణ నలుమూలలా ఐటీని విస్తరించి..కంపెనీలను ఆహ్వానించి…భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేందుకు కేటీఆర్ చేస్తున్న క్రుషి కూడా విద్యార్ధులు, నిరుద్యోగులందరికీ తెలుసు. కరోనా కల్లోల కాలం ముగియగానే..తమకు మంచి ఉద్యోగం లభించడం ఖాయమని వారంతా నమ్ముతున్నారు.

ఇలా యువత భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకుని…ఎంతో నమ్మకంతో ఉంటే..తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్ధులను,నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి ఉసురు తీస్తున్నారు. ఇలాంటి నేతల పాపం పండే రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలను యువత తరిమి తరిమి కొడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.