ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టుపెట్టిన ఈటల

27

ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టుపెట్టిన ఈటల

ఉప ఎన్నికలు వస్తే తెరాస గెలుపు గ్యారంటీ

ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడిన ఈటల రాజేందర్​ అందరూ ఊహించినట్టుగానే పువ్వుపార్టీలోకి ఫిరాయించాడు. తన ఆత్మగౌరవాన్ని మతతత్వ పార్టీకి తాకట్టుపెట్టాడు. ఆత్మాభిమానాన్ని దొంగల పార్టీకి అమ్ముకున్నాడు. బీజేపీలో చేరగానే తెరాస నాయకులపై రెచ్చిపోయాడు. ‘‘వారి సైన్యం హరీష్ రావు, వినోద్ రావు, లక్ష్మణ్ రావు తదితరులకు హుజూరాబాద్​కు ఇన్‌చార్జిగా బాధ్యతలు ఇచ్చారు.

 

ఈటలను నీళ్లు లేని కాడ బొందిగ కొయ్యి, ప్రాణం ఉండగానే బొంద పెట్టాలని బాధ్యత ఇచ్చారు. హుజురాబాద్ ప్రజలు కుట్రలు చేదిస్తాం అంటున్నారు. నాకు పదవి ఇవ్వలేదని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇజ్జత్ తక్కువ బతుకు వద్దని నా ప్రజలు చెబుతున్నారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఈటలా.. నువ్వు ఇజ్జత్​ గురించి మాట్లాడటం అస్సలు బాలేదు. కేసీఆర్​ నీ పదవిని పీకేస్తే గత్యంతరం లేక పార్టీ పదవికి రాజీనామా చేశావు.

 

కేసీఆర్​ మళ్లీ చాన్సివ్వడని తెలిసి బీజేపీలోకి దుంకినవు. మతం, కులాల పునాదులపై రాజకీయాలు చేసే బీజేపీలో చేరిన నువ్వు తెలంగాణ కోసం పోరాడిన హరీశ్​, వినోద్​, లక్ష్మణ్​లపై విమర్శలు చేయడం సరికాదు. నీ కబ్జాల కేసుల నుంచి కాపాడుకోవడానికి బీజేపీలో చేరావని ప్రతి ఒక్కరికీ తెలుసు. అరెస్టు కాకుండా తప్పించుకోవడానికి పువ్వుపార్టీని ఆశ్రయించావు.

 

బీజేపీలో పోగానే పాపాలన్నీ మాఫీ అయిపోతాయని భ్రమిస్తున్నావ్​. పేదలు, గవర్నమెంటు భూములను లాక్కున్న నిన్ను కేసీఆర్​ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కచ్చితంగా నీ రాజకీయ జీవితాన్ని తెలంగాణ ప్రజలే బొందబెడతారు. ఇందులో డౌటేమీ లేదు. నువ్వు హుజురాబాద్​లో ఆరుసార్లు గెలిచింది కేసీఆర్​ కరిష్మా వల్ల, గులాబీకి ఉన్న జనాదరణతో అన్నవిషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు రాకముందే తెరాస పుట్టింది.

 

101 లింగాల్లో బోడి లింగానికి నువ్వు. కేసీఆర్​ కాలిగోటికి కూడా సరిపోవు. హుజురాబాద్​ ఈసారి కూడా తెరాస గెలుపు గ్యారంటీ. మోడీ, షా, నడ్డా.. ఎన్ని రౌండ్లు కొట్టినా గులాబీ విజయాన్ని ఆపలేరు. నీకు జైలు జీవితమూ గ్యారంటీ. యువర్ కౌంట్స్ స్టార్ట్స్​ నౌ ఈటల.