అధికారాన్ని ఉపయోగించి అక్రమాలు చేస్తే నీకు వంత పాడాలా.

440
 
 
ఈటల రాజేందర్.. అధికారాన్ని ఉపయోగించి అక్రమాలు చేస్తే నీకు వంత పాడాలా.
నీ నీచ స్వరూపాన్ని చూసిన ప్రజలు త్వరలోనే నిన్ను తరిమి తరిమి కొడతారు.
సీఎం కేసీఆర్ పై అనవసర విమర్శలు చేస్తే నీ రాజకీయ భవిష్యత్తు అధోగతే. 
 
 
తెలంగాణ ద్రోహుల తో చేతులు కలిపిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వారి తరహాలోనే మాటలు మాట్లాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు కన్ను మిన్ను తెలియకుండా పేద ప్రజల అసైన్డ్ భూముల కబ్జా చేయాలనుకుంటే దానికి కళ్ళప్పగించి చూస్తూ ఉండాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
 
తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృష్టికి వస్తే తప్పుచేసిన వాళ్లను ఎంత వారైనా సరే వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుందని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. ఇన్ని మాటలు మాట్లాడుతున్నా నువ్వు ఆరోజు తప్పు చేయకుండా ఉండి ఉంటే ఈ రోజు నీ గతి దుర్గతి పాలు కాకపోయేది కదా అని అందరూ అంటున్నారు. తప్పుడు పనులకు ఉపయోగించిన అధికార పదవి పోయిన తర్వాత ఈటల రాజేందర్ పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నాడు.
 
ఇక తనను నీళ్లు లేని చోట బొంద పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని అంటున్న రాజేందర్ నువ్వు నిజాలు తెలుసుకుని మాట్లాడు. నువ్వు చేసిన అరాచకాలు రోజు రోజుకి వెలుగుచూసిన క్రమంలో నీ సొంత నియోజకవర్గమైన హుజురాబాద్ ప్రజలే నిన్ను తరిమి తరిమి కొట్టి నీళ్లు లేని చోట బొంద పెడతారు అని గ్రహించు.
 
ఎంతోమంది తెలంగాణవాదులను కాదని నీకు వరుసగా రెండు సార్లు మంత్రి పదవిని ఆరుసార్లు ఎమ్మెల్యే పదవిని సీఎం కేసీఆర్ ప్రసాదిస్తే ఇపుడు ఆయన పైన అవాకులు చవాకులు పేలితే నీ నాలుక చీరేస్తారు . నీ నీచస్వరూపం నిజస్వరూపం బయటపడిందని ప్రజలందరూ గ్రహించిన తర్వాత త్వరలో జరగబోయే అసెంబ్లీ  ఉప ఎన్నికల్లో నీకు కనీసం డిపాజిట్ కూడా దక్కదని గ్రహించు.. ఈటెల.. తస్మాత్ జాగ్రత్త.