జగ్గారెడ్డి.. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడటం సిగ్గుచేటు…

314
  • జగ్గారెడ్డి.. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడటం సిగ్గుచేటు…
  • మీ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డిని ఎందుకు అభివృద్ధి పరచలేక పోయావు…
  • రాబోయే ఎన్నికల్లో నీకు ఓటమి తప్పదని తెలిసి ఇలా దుష్ప్రచారం చేస్తున్నావు…
  • త్వరలోనే నీకు నీ పార్టీకి ఘోరీ కడతారని తెలుసుకో. జాగ్రత్త…

 

కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి మాటలు తిన్నగా రానీ, లేకపోతే నువ్వు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చేందుకు పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అని తెలుసుకో.  తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి వరుసగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు.

ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నీలాంటి గుంట నక్కలు తెలంగాణ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా కూడా ఎవరూ పట్టించుకోరని తెలుసుకో. అభివృద్ధి గురించి అంతగా మాట్లాడుతున్న నువ్వు సంగారెడ్డి తరఫున ఎమ్మెల్యేగా చాలాసార్లు పని చేశావు. అయినప్పటికీ ఆ నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి పరచే లేకపోయావ్‌.


సంగారెడ్డి మెడికల్ కాలేజీ గురించి ఇంతగా మాట్లాడుతున్నా నువ్వు నీ హయాంలో మెడికల్ కాలేజీని ఎందుకు సాధించ‌లేక‌పోయివు. అప్పట్లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే కదా ఆ ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని ఎందుకు సాధించలేకపోయావో కారణాలు చెప్పు. నువ్వు పెద్ద చ‌వ‌ట‌వు కాబట్టే నీ మాటకు ఎక్కడ విలువ లేదు. ఇక మెడికల్ కాలేజి అని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం దాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తుంది అని అందరికీ తెలుసు.

దీనికి సంబంధించిన కార్యాచరణ అంత ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. రాబోయే ఎన్నికల్లో నువ్వు కచ్చితంగా ఓటమి పాలు అవుతావు అనే భయంతో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నావు. నువ్వు ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా నువ్వు కానీ నీ పార్టీ గాని ఈసారి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో లేకుండా భూస్థాపితం కాక తప్పదని తెలుసుకో. తస్మాత్ జాగ్రత్త.