కేసీఆర్​కు హరీశ్​కు మధ్య చిచ్చుకు ఈటల కుట్ర

71

కేసీఆర్​కు హరీశ్​కు మధ్య చిచ్చుకు ఈటల కుట్ర

 

గతిలేక బీజేపీలో చేరిన ఈటల… తెరాసను, కేసీఆర్​ను తిట్టడం మొదటుపెట్టారు. బీజేపీ ఉచ్చతొక్కాడు కాబట్టి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీలో తనతో పాటు మంత్రి హరీష్‌రావు సైతం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడని పిచ్చిమాటలు మాట్లాడాడు. కేటీఆర్​, హరీశ్​… కేసీఆర్​కు రెండు కండ్ల వంటి వాళ్లు. అయితే తప్పు చేస్తే వీరిద్దరినీ మందలించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొడుకు, అల్లుడు అయినంత మాత్రాన వెనుకేసుకొచ్చే ప్రసక్తే లేదని కేసీఆర్​ చాలా సార్లు చెప్పారు.

ఈ ఇద్దరూ సమర్థులు కాబట్టే మంచి పదవులు ఇచ్చారు. హరీశ్​ను చిన్నప్పటి నుంచీ కేసీఆర్​ పెంచి పెద్ద చేశారు. రాజకీయ గురువుగా కూడా ఆయనే! కేసీఆర్​ తిట్టినా కొట్టినా హరీశ్​ సీరియస్​ గా తీసుకునే చాన్సే లేదు. ఎందుకంటే హరీశ్​ ఆయనను తండ్రి కంటే ఎక్కువగా అభిమానిస్తారు. సారు ఎన్నిసార్లు మందలించినా అవమానంగా ఏనాడూ భావించలేదని హరీశ్​ పబ్లిగ్గానే ప్రకటించారు. హరీశ్​ సత్తా తెలుసు కాబట్టే ప్రతి ఎన్నికలోనూ ఆయనకు ప్రచార బాధ్యతలు అప్పగిస్తారు.

పార్టీలో సమస్య వచ్చినా హరీశే రంగంలోకి దిగుతారు. పార్టీ అంతర్గత వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారు. తండ్రీకొడుకుల్లా ఉండే కేసీఆర్​, హరీశ్​ మధ్య చిచ్చుపెట్టడానికి ఈటల ప్రయత్నిస్తున్నారు. అవమానానికి, విమర్శలకు, మందలింపుకు మధ్య తేడాలు తెలియని మనిషి ఈటల.

ఒక్కటి మాత్రం నిజం..  ఆస్తులను కాపాడుకునేందుకే.. ఈటల ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నాడు. అమాయక ప్రజల భూములను లాక్కొని.. వందల కోట్ల ఆస్తులను కూడబెట్టింది వాస్తవం. ఢిల్లీ పెద్దలు కాదు కదా.. మళ్లీ వచ్చి కేసీఆర్‌ను వేడుకున్నా.. ఎవరూ కాపాడలేరు. హుజూరాబాద్‌తో పాటు యావత్ తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారు.