పంతులూ.. మనది ధనికరాష్ట్రమే కానీ కరోనా వల్ల ఆర్థిక కష్టాలు వచ్చాయ్​

232

పంతులూ.. మనది ధనికరాష్ట్రమే కానీ

కరోనా వల్ల ఆర్థిక కష్టాలు వచ్చాయ్​

అందుకే భూముల అమ్మకం

ఇప్పటికీ తలసరి ఆదాయంలో తెలంగాణ నం.1

పెట్టుబడుల్లో అగ్రస్థానం

 

అమాయకంగా అడిగాడో.. అజ్ఞానంతో అడిగాడో తెలియదు కానీ ప్రొఫెసర్​ కోదండరామ్ ఒక పాగల్​ ప్రశ్న వేశాడు. ధనికరాష్ట్రం పేద రాష్ట్రం ఎలా అయిందని కొశ్చన్​ వేశాడు. ప్రభుత్వ భూములు అమ్మి డబ్బును సమకూర్చుకోవడం అన్యాయమని గుండెలు బాదుకున్నడు.

 

పంతులూ.. నీకు వయసు మీద పడిందని, చిప్​ సరిగ్గా పనిచేయడం లేదని అర్థమవుతున్నది. నువ్వు ఏం మాట్లాడుతున్నవో నీకే అర్థం కావట్లే! కరోనా వల్ల ఒక్క తెలంగాణే కాదు అన్ని రాష్ట్రాలు.. ఇంకా చెప్పాలంటే అన్ని దేశాలూ విలవిలలాడుతున్నాయి. వ్యాపారాలు లేవు. ఆఫీసులు తెరుచుకోవడం లేదు. రిజిస్ట్రేషన్లు లేవు. పెట్రోల్​ ఆదాయం విపరీతంగా తగ్గింది.

 

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఎన్నడూ లేనంత అధ్వానంగా మారింది. కేంద్రం నుంచి నయాపైసా ఆమ్దానీ రాదు. ఇటువంటి పరిస్థితుల్లో భూములు అమ్ముకోకుంటే ఏం చేయాలె ? కేసీఆర్​ ఇంటి వెనుక లంకెబిందెలు ఏమైనా ఉన్నయా చెప్పు పంతులు! అమెరికా వంటి దేశాలే అప్పుల కోసం ఉరుకుతున్నయ్​. మనమెంత ! ఇప్పటికీ మన రాష్ట్రం నువ్వన్నట్టు పేద రాష్ట్రం కాదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం మాత్రమే! ఈ రెండింటికీ మధ్య తేడాలను గుర్తుపెట్టుకో.

 

ఇటువంటి కష్టకాలంలోనూ తెలంగాణ జాతీయ సగటుకు మించి తలసరి ఆదాయం, ఎగుమతులు, పెట్టుబడులు సాధించింది. తాజా రిపోర్టు ప్రకారం.. పరిశ్రమల రంగంలో లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధిదొరికింది. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రూ.2.14 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 15.6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి.  పెట్టుబడుల్లో రిపీట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ చూస్తే 80% ఉన్నవి. 2020-21లో టీఎస్‌ఐఐసీ కొత్తగా 10 పారిశ్రామిక పార్క్‌లు ప్రారంభించింది. 2014లో కేవలం రూ.57వేల కోట్ల ఎగుమతులు జరిగితే, ఏడేండ్ల తర్వాత ఇప్పుడు రూ. 1,45,522 కోట్లకు చేరింది. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్నదనడానికి ఇంతకుమించిన ఉదాహరణలు ఏం కావాలి ?

 

సీఎం నాయకత్వంలో వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్‌ తదితర రంగాల్లో అభివృద్ధి దూసుకుపోతున్నది. గ్రామీణ, పట్టణ అన్న తేడా లేకుండా సమతుల్య వృద్ధిని రాష్ట్రం నమోదు చేస్తున్నది. ఐటీలోనైతే తెలంగాణను బీట్​ చేయడం ఎవరి వల్లా కావడం లేదు. . 2020‌‌–-21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9.78 లక్షల కోట్లు కాగా, భారత్‌ మొత్తంగా చూస్తే జీడీపీ 8% తగ్గితే, తెలంగాణలో తగ్గుదల 1.26 శాతమే ఉన్నది. వ్యవసాయ రంగంలో 20.9% వృద్ధి సాధించారు. ఇది జాతీయస్థాయిలో 3శాతం మాత్రమే. తెలంగాణలో 20.9% ఉన్నది.  దేశ తలసరి వార్షికాదాయం రూ.1,27,768 ఉంటే, తెలంగాణలో రూ.2,27,145గా ఉన్నది. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులుంటే.. ఇప్పుడు వారి సంఖ్య 6.28 లక్షలకు పెరిగింది