కేటీఆర్…నిజమైన హీరో: సోనూసూద్ ప్రశంస.

22

 

కేటీఆర్…నిజమైన హీరో: సోనూసూద్ ప్రశంస.

 

కరోనా కాలంలో క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు కేటీఆర్. కరోనా బాధితుల, కుటుంబ సభ్యుల విజ్నప్తులకు యుద్ధప్రాతిపదికన స్పందించి…సాయం అందించే ఏర్పాటు చేశారు  కేటీఆర్. సోషల్ మీడియాలో తనను కోరిన వారికి, కేటీఆర్ కార్యాలయాన్ని సంప్రదించినవారికి తక్షణమే..సాయం అందుతోంది. అందుకే రాష్ట్ర ప్రజలు ఏ సమస్య వచ్చినా..కేటీఆర్ ఉన్నారన్న భరోసాతో ఉన్నారు. తమ బాధలను  కేటీఆర్ తో చెప్పుకుని సాయం పొందుతున్నారు. మంత్రి హోదాలో తెలంగాణ ప్రజలందరినీ కంటికి రెప్పలా కాచుకునే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ పై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఇందుకు కరోనా సాయంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సోనూసూద్..కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన ప్రశంసే నిదర్శనం. కేటీఆర్ కార్యాలయం నుంచి సాయమందుకున్న ఓ వ్యక్తి…మీ సాయాన్ని మరువలేం..మీరు సూపర్ హీరో అని ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తానొక సాధారణ ప్రజా ప్రతినిధిని మాత్రమేనని..సోనూసూద్ అసలైన సూపర్ హీరో అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన సోనూసూద్…స్పందించారు.

తెలంగాణ అభివ్రుద్ధికి క్రుషి చేస్తున్న నిజమైన హీరో కేటీఆర్ అని పొగడ్తల వర్షం కురిపించారు. కేటీఆర్ ను సోనూసూద్ నిజమైన హీరో  అని ప్రశంసించడంపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. అడిగినవారందరికీ శక్తివంచన లేకుండా సాయమందించేందుకు ప్రయత్నిస్తున్న కేటీఆర్, సోనూసూద్ ఇద్దరూ..ఇద్దరేనని నెటిజన్లు అంటున్నారు. నిజానికి సోనూసూదే కాదు..కరోనా కల్లోల కాలంలో బాధితుల విషయంలో కేటీఆర్ అత్యంత బాధ్యతగా వ్యవహరిస్తున్న తీరు..దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది.

కరోనా తొలి వేవ్, సెకండ్ వేవ్ లో వైరస్ పరిస్థితి చేయిదాటకుండా…కేసీఆర్ పకడ్బందీగా కట్డడి చర్యలు అమలుచేశారని..పరిశీలకులు అంటున్నారు. ..కల్లోల కాలంలో ప్రజల బాధలు తీర్చేందుకు అహర్నిశలూ శ్రమిస్తూ..కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడని పలువురు ప్రశంసిస్తున్నారు. దేశంలోని అనేక మంది నేతలు మహమ్మారి కాలంలో ప్రజలకు ముఖం చాటేశారు. కేసులు, మరణాలతో భీతిల్లుతున్న ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన నేతలు..కరోనా భయంతో నాలుగుగోడలకు పరిమితమవుతున్నారు. దేశమంతా అలాంటి నేతలుంటే..తెలంగాణ నాయకత్వం మాత్రం..సంక్షోభం వేల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతోంది.