తెలంగాణలో మత రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపి…

149

  • రాముని ఆలయం పేరు చెప్పి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నం…
  • పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాలను తెలంగాణ నుంచి నాడు ఎందుకు విడదీశారు…
  • మీరు చేసిన పాపం ఊరికే పోదు.. మట్టి కొట్టుకుపోతారు…


తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం గురించి మాట్లాడే అర్హత భారతీయ జనతా పార్టీ నేతలకు అస్స‌లు లేదు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో తెలంగాణ నుంచి ఏడు మండలాలను విడదీసి ఆంధ్రాలో కలిపిన నీచ నికృష్ట దుర్మార్గులు కమలనాథులు. ఇప్పుడేమో పోలవరం ప్రాజెక్టు కారణంగా భద్రాచల సీతా రామ స్వామి ఆలయం మునిగిపోతుందని మొసలి కన్నీరు కారుస్తున్నారు.

 

నాడు ఆంధ్రప్రదేశ్కు పోలవరం ప్రాజెక్టు కట్టేందుకు అనుమతి ఇచ్చినప్పుడు ఈ విషయం మీరు పరిగణలోకి  తీసుకుపోలేదు రా హౌలేగాళ్లారా అని ప్రశ్నిస్తుంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో కమలనాథులకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా పొంగులేటి సుధాకర్ రెడ్డిలాంటి పూటకో పార్టీ మార్చే నాయకులు ఈ విషయం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నది. కేవలం మత రాజకీయాలకు మాత్రమే రాముని గురించి మాట్లాడడం భారతీయ జనతా పార్టీ నాయకులకు అలవాటుగా మారింది. తెలంగాణలో మత రాజకీయాలను నెలకొల్పి త‌ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు పార్టీ నేతలు ప్ర‌య‌త్నిస్తున్నట్లు గా అర్థం అవుతోంది.


కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని సర్కారే కదా పొంగులేటి సుధాకర్రెడ్డి దమ్ముంటే నువ్వు కేంద్రానికి చెప్పి బ్యాక్ వాటర్ సీతారామ స్వామి ఆలయాన్ని ముంచెత్త‌కుండా ఏపీని ఆదేశించమ‌ని చెప్పించ‌గ‌ల‌వా. భారతీయ జనతా పార్టీ నేతల మాటలు కోటలు దాటుతాయి కాని చేతలు శూన్యమని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది.

గత ఆరేళ్లుగా తెలంగాణపై శీతకన్ను వేస్తూ సవతి తల్లి ప్రేమ చూపిస్తూ అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్న కమలనాథులరే ప్రతి ఎన్నికల్లోనూ తెలంగాణ పౌరులు ఓటుహ‌క్కుతో బుద్ధి చెబుతూ వస్తున్నారు. అయినప్పటికీ వాళ్లకు ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడేమో రాముని పేరు చెప్పి రాజకీయాలు చేసి తెలంగాణలో బలపడాలని వీళ్లు చేస్తున్న ప్రయత్నం వృధా అని పొంగులేటి ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. మీ మత‌ రాజకీయాలు ఉత్తరాదిలో నడుస్తాయి. అంతేగానీ తెలంగాణ లో విజ్ఞులైన ప్రజల ముందు నడవవ‌ని తెలుసుకో పొంగులేటి. తస్మాత్ జాగ్రత్త.