ప్రతిష్టాత్మకంగా మేడారం జాతర ఏర్పాట్లు

102
0
  • 75 కోట్ల రూపాయలతో మేడారం జాతరలో అన్ని వసతులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.
  • భక్తుల సౌకర్యాలను దగ్గరుండి చూసుకుంటున్న అధికార యంత్రాంగం.
  • విమర్శించడం తప్ప నిజాలు గ్రహించడం చేతగాని తెలంగాణ వ్యతిరేక ఈనాడు.
ఆసియాలోనే అతిపెద్ద జాతర అయినా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రభుత్వం 75 కోట్లు ఖర్చుపెట్టి భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులను ఏర్పాటు చేసింది. రాష్ట్రం నుండే కాకుండా దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకోవడం కోసం మేడారం సమ్మక్క సారక్క జాతర కు వస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రధానంగా భక్తుల సౌకర్యార్థం జంపన్న వాగులో  స్నానం చేయడానికి ప్రత్యేక ఘాట్లు, మహిళలు వస్త్రాలు మార్చుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది. కొత్త రహదారులు, మరుగుదొడ్లు మరియు అన్నిచోట్ల మంచి నీటి వసతి ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ప్రథమ చికిత్స కార్యాలయాలు మరియు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సౌకర్యాలు కూడా కల్పించింది. ఈ జాతరలో పారిశుద్ధ్యం మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ నిషేధం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచింది.
పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్న మాదిరిగా ఎల్లో మీడియా బాప్ ఈనాడు కి జాతర సజావుగా జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలేవీ కనిపించడం లేదు. మంచిని గ్రహించకుండా కేవలం విమర్శించడానికే ప్రతిపక్ష పార్టీల మీడియా పనిగట్టుకొని కూర్చుంది. జాతరలో లేని ఇబ్బందులను ఉన్నట్టుగా తప్పుడు ప్రచారాలు చేస్తూ భక్తులను ఆందోళనకు గురి చేస్తుంది. భక్తులకు మంచినీటి అవసరాలకు ప్రభుత్వం చేసిన చర్యలను భక్తులు అభినందిస్తూ ఉంటే ఒక్క తెలంగాణ వ్యతిరేక ఈనాడు మీడియా మాత్రం లేనిపోని అనుమానాలను సృష్టిస్తోంది. అయితే ఎల్లో మీడియా అసత్యాలు ప్రసారం చేయడంలో రాష్ట్రంలోనే ముందు ఉంటుంది కాబట్టి భక్తులు దీన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేడారం జాతరను తెలుగుదేశం ప్రభుత్వం కానీ , కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎప్పుడు శ్రద్ధ చూపించే లేదు. ఏదో మొక్కుబడిగా సౌకర్యాలు ఏర్పాటు చేసి భక్తులను ఇబ్బందులకు గురిచేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భక్తులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ భక్తుల మన్ననలను పొందుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here