మరోసారి రోత బుద్ధిని బయటపెట్టుకున్న బీజేపీ
నామా ఇంటిపై ఈడీ సోదాలు
బీజేపీ గెలుపు కోసం మోడీ వ్యూహాలు, ప్రతివ్యూహాలు అని.. అమిత్ షా సమాలోచనలు జరుపుతున్నారని వార్తలు వస్తాయి కానీ ఇవన్నీ వట్టి ట్రాష్. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, చర్చలు, ప్రతిచర్చలు ఏమీ ఉండవు. చాలా సింపుల్‌గా ఎమ్మెల్యేలను, ఎంపీలను కొంటారు. అమ్ముడుపోకుంటే అంతు చూస్తారు. బస్! బీజేపీ తను అనుకున్నది సాధించడానికి ఎప్పుడూ ఒక షార్ట్‌కట్‌ను అనుసరిస్తుంది.
అదేంటంటే.. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతుంది. మాట వింటే ఓకే. లేకపోతే దొంగ కేసులు పెట్టి వేధిస్తుంది. ఆంధ్రా, తెలంగాణ సహా దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఇదే దందా! సాక్షాత్తూ సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా బీజేపీ మారలేదు. ఈడీ, సీబీఐలను పంజరంలోని చిలకలుగా మార్చాలని మొట్టికాయలు వేసినా.. దున్నపోతు మీద వానపడ్డట్టే! మోడీకి, షాకు చీమకుట్టినట్టు అయినా లేదు.
ఇప్పుడు తెలంగాణలో ఆపరేషన్ ఈడీ స్టార్టయింది. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ శుక్రవారం సోదాలు మొదలుపెట్టింది. మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో ఎక్కువ మొత్తంలో లోన్లు తీసుకొని.. విదేశీ కంపెనీలకు మళ్లించారని ఆరోపిస్తున్నది. నామాకు సంబంధించిన ఇల్లు, ఆఫీసులలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందంటే వందల కోట్లు కోర్టులకు ఎగనామం పెట్టి కోర్టులతో తిట్టించుకున్న సుజనా చౌదరి, రాయపాటి వంటి ఎందరో నాయకులు బీజేపీలో షెల్టర్ పొందుతున్నారు.
రఘురామ రాజుదీ ఇదే స్టోరీ. నామా టీడీపీలో ఉన్నప్పటికీ ఎటువంటి సమస్యా లేదు. తెరాసలో చేరగానే ఈడీకి ఆయనలో చాలా తప్పులు కనిపిస్తున్నాయి. సోదాలు చేయాలని ఈడీ సొంతగా నిర్ణయించుకుందంటే ఎవరైనా నమ్ముతారా ? దీని వెనుక ఎవరు ఉన్నారో, రిమోట్ కంట్రోల్ ఎక్కడుందో ప్రతి ఒక్కరికీ తెలుసు.