ఆరేళ్లలో 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మోడీనా కేసీఆరా.. సంజయ్​ ?

88

ఆరేళ్లలో 1.30 లక్షల ఉద్యోగాలు

ఇచ్చింది మోడీనా కేసీఆరా.. సంజయ్​ ?

మోడీ చెప్పిన 2 కోట్ల జాబ్స్​ ఏమయ్యాయి ?

ఎకానమీ బాగాలేకున్నా ఇన్ని జాబ్స్​ ఇచ్చింది తెలంగాణ మాత్రమే

 

కేసీఆర్​ ఈ ఆరేళ్లలో ఒక్క జాబ్​ నోటిఫికేషన్​ కూడా ఇవ్వలేదట. జస్ట్​ వాళ్ల ఇంట్లో వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకున్నడట! నిరుద్యోగుల పొట్ట కొట్టిండట! బండి సంజయ్​ అనే బాడ్కావ్​ ఇప్పటి వరకు ఈ అబద్ధాన్ని వందసార్లు చెప్పాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్లలో 1.30 లక్షలకుపైగా జాబ్స్ ఇచ్చిందని, ప్రైవేటు సంస్థల ద్వారా 4.5 లక్షల మంది ఉపాధి దొరికిందని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు చెప్పినా బీజేపీ సిగ్గులేకుండా అబద్ధాలను ప్రచారం చేస్తూనే ఉంది. ప్రభుత్వంపై బురద జల్లుతూనే ఉంది. తాను అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోడీ ఇచ్చిన హామీ గాలికిపోయింది. ఈ విషయం గురించి సంజయ్​ బ్యాచ్​ ఒక్క మాట కూడా మాట్లాడదు. మోడీ అన్ని సెక్టార్లను సర్వనాశం చేసిన విషయాన్ని ప్రస్తావించదు.  జీఎస్టీ, నోట్లరద్దు, అక్రమ లాక్డౌన్లతో దేశాన్ని పదేళ్లు వెనక్కి నెట్టడం గురించి నోరుతెరవరు. కరోనాను కట్టడి చేయడంలో మోడీ వైఫల్యాన్ని పక్కదోవ పట్టించడానికే సంజయ్​ లాంటి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు.

ఇచ్చిన ఉద్యోగాల వివరాలివి…

తెలంగాణ వచ్చినప్పటి నుంచి టీపీపీఎస్సీ ద్వారానే 33 వేల జాబ్స్ వచ్చాయి. మిగతా శాఖల్లో లక్ష వరకు జాబ్స్ ఇచ్చారు.  సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడ్డ వివరాల ప్రకారం.. తెలంగాణ సేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ – 30,594;  తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ – 31,972; తెలంగాణ స్టేట్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌- 3,623; ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ – హైదరాబాద్‌ – 179; శ్రీ కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ – హైదరాబాద్‌- 80; డైరెక్టర్‌, మైనారిటీస్‌ వెల్ఫేర్‌ – 66; జూనియర్‌ పంచాయతీ సెక్రెటరీలు – 9,355;  డిపార్ట్‌మెంట్‌ అఫ్‌ ఆయుష్‌ – 171; టీఎస్‌ జెన్‌కో – 856; టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ – 164;  టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ – 201; టీఎస్‌ ట్రాన్స్‌ కో – 206; టీఎ్‌సఆర్టీసీ – 4,768; సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ – 12,500; జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌ – 6,648;  విద్యుత్‌ శాఖలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్థీకరణ – 22,637; హైదరాబాద్‌ జలమండలి- 807; తెలంగాణ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ – 243; డీసీసీబీలు – 1,571  జాబ్స్​ ఇచ్చాయి. భర్తీ ప్రక్రియ తుదిదశలో ఉన్న ఉద్యోగాలు సంఖ్య  6,258 వరకు ఉంది. ఇవన్నీ కలిపితే మొత్తం ఉద్యోగాల సంఖ్య  1,32,899.  వివరాలు ఇంత క్లియర్​ గా ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్​ నాయకులు మాత్రం నీచంగా మాట్లాడుతున్నరు. ఒక రాష్ట్రం 1.30 లక్షల జాబ్స్​ ఇస్తే.. దేశాన్ని నడిపే ప్రధాని మాత్రం కనీసం 10 వేల జాబ్స్ ఇవ్వలేకపోయాడు. జాబ్స్​ సంగతి అటుంచితే.. కనీసం వ్యాక్సిన్లు కూడా అందించలేదని సన్నాసి మన మోడీ.