పొన్నాలకు ప్రజలే గుణపాఠం నేర్పిస్తారు….

401

పొన్నాలకు ప్రజలే గుణపాఠం నేర్పిస్తారు….

 

తెలంగాణ దేశానికే మెడికల్ హబ్ గా మారింది. కరోనాను తెలంగాణ ప్రభుత్వం కట్టడి చేసిన స్థాయిలో దేశంలో మరే రాష్ర్రం నియంత్రించలేదననడం అతిశయోక్తి కాదు. మొదటివేవ్ లోనూ,  సెకండ్ వేవ్ లోనూ సీఎం కేసీఆర్ యుద్ధప్రాతిపదికన తీసుకున్న నిర్ణయాలు…రాష్ట్రంలో వైరస్ తీవ్రతను తగ్గించగలిగాయి.

ఏడాది క్రితం కరోనా వ్యాప్తి ప్రారంభంకాగానే..గాంధీని పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చిన సీఎం కేసీఆర్. టిమ్స్ ను కరోనా చికిత్సకూ కేటాయించారు. ఎప్పటికప్పుడు టెస్టులు నిర్వహిస్తూ, బాధితులకు సకాలంలో చికిత్స అందిస్తూ తొలి వేవ్ లో కరోనా చేయిదాటిపోకుండా అన్ని చర్యలూ తీసుకున్నారు.

రెండో వేవ్ మొదలవుతుండగానే..సీఎం కేసీఆర్ శరవేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆక్సిజన్ కొరత తలెత్తకుండా…కార్గో విమానాలతో ఆక్సిజన్ దిగుమతి చేసుకుని ఆస్పత్రులకు సరఫరాచేశారు. దేశమంతా కరోనా మారణహోమం స్రుష్టిస్తున్న సమయంలో మిగిలిన రాష్ట్రాలతో పోలీస్తే…తెలంగాణలో కేసుల సంఖ్య, మరణాల సంఖ్య కాస్త తక్కువగా ఉంది.

అలాగే బాధితులకు మెరుగైన వైద్యం అందుతోంది. అందుకే అన్ని రాష్ట్రాల నుంచి కరోనా రోగులు క్యూ కడుతున్నారు. కేంద్రం సైతం తెలంగాణలో అందుతున్న కరోనా చికిత్సపై సంత్రుప్తి వ్యక్తంచేసింది. కానీ ఇక్కడి ప్రతిపక్షాలకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండదండగా ఉండి ధైర్యం చెప్పాల్సిన నీతులు…ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తూ పొద్దుపుచ్చుతున్నారు. కాంగ్రెస్ నేతలందరిదీ ఇదే తీరు.

ప్రజలు తమను మర్చిపోతుండడంతో..ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా వార్తల్లో నిలవాలన్నది వారి ఆరాటం. అందుకే రోజుకో నేత..కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై అర్ధం లేని విమర్శలు, అనవసరపు ఆరోపణలు చేస్తూ ప్రజల ద్రుష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా పొన్నాల లక్ష్మయ్య వంతు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా  పనిచేసినప్పటికీ..పొన్నాలను తెలంగాణ ప్రజలు దాదాపుగా మర్చిపోయారు. ఆయన కూడా తాను రాజకీయాల్లో ఉన్నానని..విపత్తులు ముంచెత్తిన వేల ప్రజలకు చేతనైనంత సేవ చేయాలని మర్చిపోయారు.

అయితే ఇటీవల కొందరు కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడంతో..రేసులో తాను వెనకపడిపోతున్నానన్న భయం మొదలయింది పొన్నాలలో. అందుకే ప్రభుత్వంపై తానూ ఓ రాయి విసురుతున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రాధాన్యతను గుర్తించలేని దౌర్భాగ్యపు సీఎం అని కేసీఆర్ ను ఉద్దేశించి పొన్నాల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అయితే నిజంగా రాష్ట్రంలో దౌర్భాగ్యపు  రాజకీయాలు చేస్తోందెవరో  ప్రజలకు తెలుసు. స్వయంగా కరోనా బారిన పడినప్పటికీ…విశ్రాంతి అన్నది లేకుండా సీఎం కేసీఆర్ కరోనాను నియంత్రించేందుకు కష్టపడుతున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు. సీఎంపై చవకబారు విమర్శలు చేసే పొన్నాల లాంటి నేతలకు ప్రజలే సరైన సమయంలో గుణపాఠం నేర్పిస్తారు.