- పోతురాజులా ఊగుడు కాదు… దమ్ముంటే ఆధారాలు చూపెట్టు!
- మిడ్‌మానేరులో అవినీతి జరిగినట్టు నిరూపించు
- లేకుంటే పొన్నం ప్రభాకర్ ముక్కు నేలకు రాయాలి
కాంగ్రెస్ పార్టీ నాయకులు నీతి, అవినీతి గురించి మాట్లాడితే వినడానికే అసహ్యంగా ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టునూ సరిగ్గా కట్టలేదు. తెరాస ప్రభుత్వం వచ్చాక అన్నింటి పూర్తి చేస్తోంది. దీంతో కాంగ్రెస్ నాయకులకు కడుపు మంట పెరుగుతోంది. వీళ్లు కేవలం డబ్బు కోసం అప్పట్లో ప్రాజెక్టులను తూతూమంత్రంగా నిర్మించి మధ్యలో వదిలేశారు. వాటిని కేసీఆర్ పూర్తి చేశారు. అవినీతి చేసిందే వీళ్లయితే.. ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయి విచారణ జరిపించాలని ఉల్టా మాట్లాడుతున్నారు. మిడ్ మానేరు నిర్మాణంలో అవినీతి జరిగిందని పొన్న ప్రభాకర్ చేసిన విమర్శలే ఇందుకు నిదర్శనం. సరే ప్రభాకర్ భాయ్.. అవినీతి జరిగింది.. మరే నీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉన్నాయా ? ఏవైనా డాక్యుమెంట్లు తెచ్చినవా ? ఆడియో వీడియో సాక్ష్యాలు దగ్గర పెట్టుకున్నవా ? ఏవీ లేవు. అయినా పిచ్చికుక్క మొరిగినట్టు మొరిగితే ఏమొస్తది. ఆధారాలు ఉంటే కోర్టులో ఒక పిటిషన్ వెయ్. సీబీఐకి కంప్లెయింట్ ఇవ్వు. ఇవన్నీ చేయకుండా గోలగోల చేస్తే నిన్ను ఎవడు పట్టించుకుంటడు.
మిడ్ మానేరు నిర్మాణంలో నాణ్యతలో రాజీపడలేదు. ఏ కొత్త ప్రాజెక్ట్ పూర్తి అయిన నీటిని దశలవారీగా నింపి పరీక్షించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే గత రెండు సంవత్సరాలుగా 6 టిఎంసిల నీటిని నింపారు. ప్రస్తుత సంవత్సరం ఆగస్టులో ప్రాజెక్టులో 15 టిఎంసిల నీటిని నింపారు. ఈ క్రమంలో రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒర్రె ప్రాంతంలో కొంత నీరు బయటకు వచ్చినట్టు గుర్తించారు. వెంటనే మరమ్మతులు చేశారు. కొత్త ప్రాజెక్టుకు మరమ్మతులు సహజం. మిడ్ మానేరును అత్యంత వేగంగా నిర్మించారు. రిపేర్ల తరువాత మళ్లీ నీటిని నింపారు. నాడు రాజశేఖరెడ్డి హయాం లో మిడ్‌మానేరు నిర్మాణం చేపట్టగా.. పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా దృష్టి సారిం చి పూర్తి చేశారు. కాంగ్రెస్ పాలనలోనే ప్రాజెక్టు కట్ట బండ్ నిర్మాణ పనులు జరిగింది. అదే కట్టకు ఏర్పడిన చిన్న లోపంపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేయడం విచిత్రం.