తప్పు చేస్తే తుప్పు రేగుతది! మరోసారి ప్రైవేటు ఆస్పత్రులపై వేటు

237

తప్పు చేస్తే తుప్పు రేగుతది!

మరోసారి ప్రైవేటు ఆస్పత్రులపై వేటు

ఆరు ఆస్పత్రుల లైసెన్సులు క్యాన్సిల్​

కరోనా చికిత్స పేరుతో రోగుల రక్తం పీల్చుతున్న ప్రైవేటు హాస్పిటల్స్​ అంతు చూస్తోంది కేసీఆర్​ సర్కారు. ఎక్కువ ఫీజులు వసూలు చేసినా, ట్రీట్​మెంట్లలో లోపం ఉన్నా, కరోనా ప్రొటోకాల్స్​ పాటించకపోయినా నిర్మొహమాటంగా లైసెన్సులు రద్దు చేస్తోంది. షోకాజ్​ నోటీసులు ఇస్తోంది. పైరవీలను, సిఫార్సులను పట్టించుకోవడం లేదు. ఎంతపెద్ద వారైనా వదలడం లేదు. జనం ఆరోగ్యం కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని స్పష్టమైన సంకేతాలు పంపుతోంది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత ధైర్యంగా వ్యవహరించడాన్ని చూడలేదు.

ప్రైవేట్​, కార్పొరేట్​ ఆస్పత్రుల బాసులకు కచ్చితంగా పొలిటికల్​ లింకులు ఉంటాయి కాబట్టి వారి జోలికి ఎవరూ వెళ్లబోరని అనుకుంటారు. కేసీఆర్​ పాలనలో ఇవన్నీ నడవడం లేదు. తప్పు చేస్తే చర్యల నుంచి తప్పించుకోవడం అసాధ్యంగా మారుతోంది. కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వహించారని తేలడంతో రాష్ట్రంలో మరో ఆరు ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం నిషేధం వేటు వేసింది. ఇప్పటి వరకు ఉన్న రోగులందరికీ చికిత్స కొనసాగించాలని.. కొత్త కరోనా రోగులను చేర్చుకోవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా చికిత్స పేరుతో దందాలు నిర్వహిస్తూ.. రోగులను అడ్డగోలుగా నిలువుదోపిడీ చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులపై చర్యలకు మూడ్రోజుల క్రితం  64 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిర్యాదు దారుల అనుమానాలను షోకాజ్ నోటీసులలో తెలియజేయగా సరైన జవాబు రాకపోవడంతో సోమవారం మరో ఆరు హాస్పిటల్స్ కు కరోనా చికిత్సను రద్దు చేస్తూ హెల్త్ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి మ్యాక్స్​కేర్​ వంటి బడా ఆస్పత్రులూ ఉన్నాయి. 

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 16 హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్ రద్దు  చేసినట్లయింది. ఇప్పటి వరకు 105 హాస్పిటల్స్ మీద 166 కంప్లైంట్స్ వచ్చాయి. బంజారాహిల్స్ విరించి ఆస్పత్రిలో కరోనా రోగి బంధువు గొడవతో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల వ్యవహార శైలిపై ప్రభుత్వం కోపంగానే ఉంది.  కరోనా ప్రారంభమైనప్పటి నుండి 64 ఆస్పత్రులపై 88 ఫిర్యాదులు రాగా.. ఈ రెండు రోజుల్లోనే ఆస్పత్రుల సంఖ్య 105కు చేరుకోగా ఫిర్యాదులు కూడా 166కు చేరుకున్నాయి.  దీంతో ప్రైవేటు ఆస్పత్రులు తప్పు చేయాలంటే భయపడుతున్నాయి.