అబద్దాలాడుతోంది మీరే సంపత్.

62

 

  • అబద్దాలాడుతోంది మీరే సంపత్.
  • పొద్దున లేస్తే పచ్చి అబద్దాలు చెప్తున్నారు.
  • కరోనా నివారణలో ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తున్నా..
  • ప్రజలను గాలికి వదిలేసిందని ప్రచారం చేస్తున్నారు.
  • ప్రభుత్వ హాస్పిటల్స్ లో వేలమందికి చికిత్స అందిస్తుంటే..
  • సర్కార్ దవాఖానాల్లో చికిత్స అందడం లేదంటారు?.
  • ఇవి అబద్దాలు కాక మరేంటివి  సంపత్ కుమార్.

గోరంత దాన్ని కొండంత చేసి చూపించడం.. పొద్దున లేస్తే.. పచ్చి అబద్దాలు ప్రచారం చేయడం కాంగ్రెస్ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య సంపత్. మీరు విష ప్రచారం చేస్తూ మంత్రులు అబద్దాలు చెప్తున్నారని విమర్శిస్తున్నావ్. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారు. కేటీఆర్, ఈటల ఏ విషయాన్ని దాచి పెట్టడం లేదు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని.. శక్తికి మించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తోందని.. ఉన్న వాస్తవమే చెప్తున్నారు మంత్రులు.

ప్రభుత్వ దవాఖానాల్లో వేల మందికి చికిత్స అందించి.. కరోనాను నయం చేసి దర్జాగా ఇంటికి పంపుతుంటే.. ప్రజల ప్రాణాలు గాలికొదిలేశారని అంటున్నారు. 30వేలకు పైగా బాధితులుంటే.. అందులో చనిపోయింది జస్ట్ 300 మాత్రమే. చనిపోయిన వారంతా వేరే ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారే. దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతూ కరోనాను తట్టుకోలేక మరణించారే కానీ.. కేవలం కరోనా వల్ల, ప్రభుత్వం చికిత్స అందించకపోవడం వల్ల మరణించలేదు. ఇదే మీరు చేస్తున్న తప్పిదం.. ఎవరు చనిపోయినా..ప్రభుత్వం సరిగ్గా చూసుకోకనే చనిపోయారంటున్నారు. వైద్యులు ఇచ్చే రిపోర్ట్ చదవరు. వారు అందించే ట్రీట్మెంట్ చూడరు.

నరం లేని నాలుకతో ఇష్టారీతిన మాట్లాడతారు. వాస్తవం ఏంటనేది తెలసుకునే ప్రయత్నం చేయరు. పోనీ ప్రభుత్వ మంత్రులు చెప్తుంటే వింటారా అంటే అబ్బే అదీ లేదు. మీరు అబద్దాలు ప్రచారం చేసుకుంటూ.. తిరిగి మంత్రులు వాస్తవాలు చెప్పడం లేదని బురద జల్లే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ నాయకుల తీరు ఎలా ఉందంటే.. దొంగే దొంగదొంగ అని అరిచినట్లుంది సంపత్. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియజెప్పండి. జనంలో మార్పు రావాలంటే ప్రతిపక్షం కూడా బాధ్యతగా వ్యవహరించాలి.