పెరుగుతున్న ట్రాఫిక్ కు తగ్గట్టుగా కొత్త వన్నెలద్దుకుంటున్న తెలంగాణ రాష్ట్ర రోడ్లు. 

1074

 

  • పెరుగుతున్న ట్రాఫిక్ కు తగ్గట్టుగా కొత్త వన్నెలద్దుకుంటున్న తెలంగాణ రాష్ట్ర రోడ్లు. 
  • ట్రాఫిక్ నియంత్రించడానికి హైదరాబాద్ నగరంలో పెరిగిన ఫ్లైఓవర్లు, అండర్పాస్ లు. 
  • గడిచిన ఐదేళ్లలో టిఆర్ఎస్ పాలనలో విశ్వనగరం గా ఎదుగుతున్న హైదరాబాద్. 
  • పల్లెపల్లెకు డబల్ రోడ్డు తో రాజధాని కి కనెక్ట్ చేసిన వైనం. 
తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఐదు సంవత్సరాలు అవుతుంది,ఈ ఐదు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చాలా మట్టుకు పెరిగింది దాన్ని ధీటుగా అది గమనించాలి అన్న ఉద్దేశంతో గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి సూచన మేరకు పదుల సంఖ్యలో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు ప్రవేశపెట్టడం జరిగింది.అత్యాధునిక స్కై వేలు, ఫుడ్ పాత్లతో హైదరాబాద్ నగరం విశ్వనగరాన్ని తలపించేలా మారింది అంటే అతిశయోక్తి కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ లో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంది, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న అన్ని మెట్రో లు నష్టాలలో నడుస్తుంటే హైదరాబాద్ మెట్రో రైల్ మాత్రం లాభాలబాటలో అత్యాధునికమైన వసతులను హైదరాబాద్ నగర ప్రజలకు కల్పిస్తుంది అంటే దానికి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల తారక రామారావు గారి పాత్ర ఎంతైనా ఉంది.ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని మెట్రో లు కూడా హైదరాబాద్ మెట్రో మార్గంలోనే నడుస్తామని చూస్తున్నాయి అంటే అది హైదరాబాద్ మెట్రో సాధించిన ప్రగతి గానే పరిగణించాలి.
ఒకప్పుడు పండుగలప్పుడు పల్లెకు పోవాలంటే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ గతుకుల రోడ్డులో గమ్యం తెలియని పరిస్థితి ఉండేది కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్ గారు ఎప్పుడైతే ప్రమాణస్వీకారం చేశారో అప్పటినుండి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పల్లెలు, ముఖ్యంగా అదిలాబాద్ నుంచి మొదలుకొని మహబూబ్నగర్ వరకు రాష్ట్రం నలుమూలలు  రాజధానికి గొప్పగా కనెక్ట్ చేసారు అంటే అది కెసిఆర్ గారి నిబద్ధత పట్టుదలతో మాత్రమే సాధ్యమైంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పల్లె పల్లెను కనెక్ట్ చేస్తూ వేసిన డబుల్ రోడ్ లో ఇప్పుడు ప్రయాణం చేయాలంటే  అందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించిన గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి తెలంగాణ ప్రజానీకం మొత్తం ధన్యవాదాలు తెలుపుతుంది. నిజానికి వాస్తవాలు ఇలా ఉంటే దీన్ని వక్రీకరించే విధంగా వెలుగు పత్రికలో అసత్యాలు ప్రచురించారు దీని ప్రజలు ఎట్టి పరిస్థితిలో నమ్మరు, ఇది సత్యదూరమైన వాదనగా ఉంది అని తెలంగాణ ప్రజలు చెబుతున్నారు.