- జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట…
అనేక సంక్షేమ కార్యక్రమాలతో అండదండగా నిలుస్తున్న కేసీఆర్ సర్కారు…
ప్రతిపక్షాలకు అమ్ముడుపోయిన కొందరు నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారం…
దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని తెలుసుకోండి…
కొన్ని జర్నలిస్టు సంఘాల నాయకలు ప్రతిపక్ష నాయకులకు అమ్ముడుపోయినట్లు వాళ్ల మాటలను బట్టి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని సంఘాల నాయకులు మాట్లాడుతున్న మాటలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. స్వరాష్ట్రం సిద్దించాక తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే జర్నలిస్టులకు సంబంధించిన అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ముఖ్యంగా వంద కోట్ల మూల నిధితో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పరిచింది.
గత మూడేళ్ళ నుంచి ఈ నిధి ద్వారా ఎంత మంది జర్నలిస్టును కేసీఆర్ సర్కారు ఆదుకుంది. ముఖ్యంగా చనిపోయిన వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు గాయపడినవారికి చేయూతనిచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు జర్నలిస్టుల బాధలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ వారికి మంచి చేయాలనే లక్ష్యంతో నిధులు కేటాయిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ మీడియా అకాడమీ ఉనికి ప్రశ్నార్థకంగా ఉండే. ఇప్పుడు సీఎం కేసీఆర్ హయాంలోనే దానికి అనేక రకమైన హక్కులు, నిధులు కల్పించారు.
ఇక గత మార్చి నుంచి లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలంగాణ జర్నలిస్టులకు అనేక విధాలుగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది. ముఖ్యంగా ప్రెస్ అకాడమీ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ బాధితులకు అండదండలను అందించింది. అయితే కొన్ని జర్నలిస్టు సంఘాల నేతలు ప్రతిపక్షాలకు అమ్ముడుపోయే ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తూ తమ లేకి బుద్ధిని కనబరుస్తున్నారు.
ఇలాంటి వారు చేస్తున్న తప్పులకు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుసుకోండి. అసలు ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో ఆదుకుంది. జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా భవనాన్ని నిర్మిస్తూ, త్వరలోనే దానిని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఇంతగా ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వంను అప్రతిష్టపాలు చేయాలని కుట్రలు చేస్తే, దీనికి తగిన మూతోడ్ జవాబును ఎదుర్కోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.