తెలంగాణ సప్తపది

34

 

తెలంగాణ సప్తపది

బంగారు తెలంగాణ కల సాకారమై ఏడేల్లు గడిచాయి. వర్తమాన ప్రజాస్వామ్య భారతంలో  ఓ అద్భుతం తెలంగాణ ఏర్పాటు. 2001లో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాదనే లక్ష్యం అని ప్రకటించినప్పుడు హేలన చేసినవాల్లే ఎక్కువమంది.13 ఏల్ల పోరాటంలో అనేక మలుపులు.  ఎన్నో ఒత్తిల్లు, ఇంకెన్నో అవమానాలు. అన్నింటినీ పంటిబిగువున భరిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా సుదీర్ఘపోరాటం చేశారు కేసీఆర్. కేంద్రంపై ఆయన ప్రయోగించిన ఆఖరి అస్త్రం నిరాహార దీక్ష.

రాష్ట్రం ఏర్పాటు తప్ప గత్యంతరం లేని పరిస్థితిని కేసీఆర్ కల్పించారు. కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటించింది. దశాబ్దాల కల సాకారం చేసిన కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకున్నారు. అన్ని సమయాల్లో అండగా నిలిచారు. ఉద్యమ సమయంలోనూ, ప్రత్యేకరాష్ట్రంలోనూ కేసీఆర్ కు బాసటగా నిలిచారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ కోసం కేసీఆర్ పోరాడిన తీరును ప్రజలెవరూ మర్చిపోలేదు. అందుకే టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత, రాష్ట్రావతరణ తర్వాత జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పట్టం కట్టారు.

2014కు మించి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన ఘన విజయానికి కారణం ఆ నాలుగున్నరేల్ల కాలంలో రాష్ట్ర్రాన్ని సీఎం అభివ్రుద్ధి పథంలో నడిపించిన విధానమే. రెండోసారి గెలిచిన తర్వాతా ఎక్కడా అలసత్వం వహించలేదు. అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమించేలా చేశారు. సీఎం కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే…29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ…దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. చెప్పినవీ..చెప్పనవీ ఎన్నో ఏడేల్ల కాలంలో నెరవేర్చారు సీఎం కేసీఆర్. ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతు భీమా, భారీ సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వంటి సంక్షేమ పథకాలు, అభివ్రుద్ధి కార్యక్రమాలు ఏకకాలంలో అమలుచేస్తూ రాష్ట్రం ముఖచిత్రం మార్చేశారు.

దండగలా ఉన్న వ్యవసాయాన్ని పండగలా మార్చి…తెలంగాణను దేశానికే అన్నపూర్ణను చేశారు. ఇక కరోనా కాలంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను..యావత్ దేశమూ అనుసరించింది. కరోనా మొదటివేవ్ మొదలు కాగానే సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుని అమలుచేశారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించకముందే స్కూల్లు, కాలేజీలు, పార్కులు, బహింరంగ ప్రదేశాలు వంటివి మూసివేశారు. గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా మార్చి…బాధితుల చికిత్సకు అవసరమైన సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. టిమ్స్ ఆస్పత్రిని కరోనాకు కేటాయించారు. దీంతో వైరస్ సోకిన వారు తక్షణమే చికిత్స పొందే వీలు కలిగి..వ్యాప్తి నియంత్రణలోకొచ్చింది. లాక్ డౌన్ లో నిరుపేదలు తిండి లేక ఇబ్బంది పడకుండా..ఉచిత భోజన సదుపాయం కల్పించారు.

వలస కూలీల తరలింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెకండ్ వేవ్ మొదలుకాగానే యుద్ధప్రాతిపదికన స్పందించి ఆక్సిజన్ కొరత లేకుండా విమానాల్లో ప్రాణవాయువు తెప్పించారు. హైదరాబాద్ ను దేశానికే మెడికల్ హబ్ గా మార్చివేశారు. కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ కరోనా ముప్పు నంచి…కొంతమేర నష్టంతో బయటపడగలుగుతుంది. ఇక ఏడేల్ల కాలంలో అన్ని రంగాలతో పాటు యువతకూ పెద్దపీట వేశారు సీఎం కేసీఆర్. లక్షమందికిపైగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. మరో 50వేల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలిచ్చారు సీఎం.  ఏడేల్ల  కొన్ని లక్షల మంది ప్రయివేట్ రంగంలో కొత్త కొలువులు పొందారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యమ నాయకునిగా, తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణను కేసీఆర్ నడిపించిన, నడిపిస్తున్న తీరు…చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.