ఈటలకు ట్రబుల్స్​ స్టార్టయినయ్​.. టీఆర్​ఎస్​ టికెట్ల కోసం లీడర్ల క్యూ

224

ఈటలకు ట్రబుల్స్​ స్టార్టయినయ్​..

టీఆర్​ఎస్​ టికెట్ల కోసం లీడర్ల క్యూ

‘ఆత్మగౌరవం’, ‘ఆత్మాభిమానం’ అంటూ సినిమా డైలాగులు కొట్టిన పోటుగాడు ఈటల ఆఖరికి బీజేపీలో చేరడంతో ఉన్న కాస్త ఇజ్జత్​ కూడా పోయింది. జనంలో మరింత చీప్​ అయిపోయాడు. ‘హుజురాబాద్​ జనం నన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటరు’, ‘ఇది నా ఇలాఖా’ అంటూ తొడగొట్టిన మనిషిని టీఆర్​ఎస్ లీడర్లు అసలు కేర్ చేయడం లేదు. టీఆర్​ఎస్ టికెట్ల కోసం  క్యూ కడుతున్నరు. ఎందుకంటే బీజేపీకి డబ్బు సంచులు తప్ప క్యేడర్ లేదు. బలమైన లీడర్లు లేరు. మోడీ, షా ఎన్ని రౌండ్లు కొట్టినా ఫాయిదా ఉంటలేదు. బండి సంజయ్​, వివేక్​, అర్వింద్​తో ఊదు కాలదు. పీరి లేవదు. ఈటలకు డిపాజిట్​ రావడం కూడా కష్టమేనని సర్వేల్లో వెల్లడయింది. దీంతో

ప్రస్తుతం అందరి చూపూ హుజూరాబాద్ నియోజవకవర్గం మీదే ఫోకస్‌‌‌‌ అయింది. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించడంతో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న ఆ సెగ్మెంట్‌‌‌‌లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి పోటీ కోసం క్యూలు కడుతున్నారు. టికెట్ ఆశిస్తున్న వాళ్లలో కొందరు ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌‌‌‌రావు ద్వారా తమకు టికెట్ ఖరారయ్యేలా లాబీయింగ్ చేస్తున్నారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌ను హుజూరాబాద్‌‌‌‌కు చెందిన కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌‌‌‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లో కలిసి టికెట్​ ఇవ్వాలని రిక్వెస్ట్​ చేశాడు. టీఆర్‌‌‌‌ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్‌‌‌‌తో పాటు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఫ్యామిలీ మెంబర్స్, మాజీ బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌‌‌‌రావు, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, టీఆర్‌‌‌‌ఎస్ నాయకుడు దొంత రమేశ్ పేర్లు వినిపిస్తున్నాయి.

మాజీ ఎంపీ వినోద్ పోటీకి సుముఖంగా లేకపోతే కెప్టెన్ ఫ్యామిలీ నుంచి ఒకరిని బరిలో నిలపాలన్నది హైకమాండ్ ఆలోచన ఉంది. మరోవైపు ఇక్కడి రాష్ట్ర నాయకుడు బండ శ్రీనివాస్ కూడా బరిలో నిలబడదామనే ఆలోచనలో ఉన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ విజయ్ కుమార్ రెండ్రోజుల కిందే హరీశ్‌‌ను కలిశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి. వీళ్లలో ఏ ఒక్కరూ ఈటల తమకు పోటీయే కాదని భావిస్తున్నారు. ఎందుకంటే టీఆర్​ఎస్, కేసీఆర్​ పవర్​ అలాంటిది! ఒక్కసారి కేసీఆర్​ అడుగుపెడితే సీన్​ మొత్తం మారిపోతుంది. ఈటల కథ క్లోజ్​ అవుతుంది. ఎన్నికలు ముగిశాక ఈటల బీజేపీ ఆఫీసులో తలపై తడిగుడ్డ వేసుకొని పడుకోవాల్సిందే!