ఆర్టీసీ కార్గో సర్వీస్ బలపడితే ఇక ఆర్టీసీ లాభాల బాట పట్టినట్టే

475
  • ఆర్టీసీ కార్గో సర్వీస్ ప్రారంభోత్సవం తో ఆర్టిసి చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర తీసిన సీఎం కేసీఆర్. 
  • ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రికి కూడా రాని ఆలోచనని అమలుచేస్తున్న సీఎం కెసిఆర్..
  • ఆర్టీసీ కార్గో సర్వీస్ బలపడితే ఇక ఆర్టీసీ లాభాల బాట పట్టినట్టే
ఆర్టిసి కార్గో సర్వీస్ పేరుతో ఆర్టీసీనే ప్రభుత్వానికి,ప్రజలకు సంబంధించిన సరుకు రవాణా చేస్తుందనే సంచలనాత్మక నిర్ణయంతో ఆర్టీసీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెర తీశారు.స్వతంత్ర భారత దేశంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రికి కూడా రాని ఆలోచన కెసిఆర్ ఏకంగా అమలు చేసి తీరుతున్నాడు అంటే ప్రజల గురించి ఎంతలా ఆలోచిస్తున్నాడో అర్థమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఇక లాభాల బాట పట్టడం ఖాయంగా అనిపిస్తుంది అని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లె పల్లె కి ఆర్టీసీ సర్వీసులు ఎలా పోతున్నాయో ఆర్టిసి కార్గో సర్వీసులు కూడా ఇప్పుడు ప్రజలకి  సరుకు రవాణా అందిస్తాయి అని సీఎం కేసీఆర్ గర్వంగా చెబుతున్నారు.సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనది అని ఇదే బాటలో మరి కొన్ని ఆర్టీసీ లు కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు ప్రస్పుటంగా అర్థమవుతుంది.ఎప్పుడైతే సమ్మె వదిలి ఉద్యోగాల బాట ఆర్టీసీ ఉద్యోగులు పట్టారో అప్పుడే ఆర్టీసీని ఎలాగైనా లాభాల బాట పట్టిస్తా అని శపథం చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు అటువైపు అడుగులు వేస్తున్నట్టు అర్థమవుతుంది. ఆర్టీసీ కార్గో సర్వీస్ గనుక బలపడితే ఆర్టీసీ తప్పకుండా లాభాల బాట పట్టినట్టు అవుతుంది. అప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల కు మరింత సంక్షేమం చేయడానికి వీలవుతుంది అలాగే తెలంగాణలో సరుకు రవాణా మరింత మెరుగుపరచి నట్టు అవుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.