విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ మొసలి కన్నీరు…

44
  • నాడు తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది చనిపోతే పదవులు పట్టుకుని వెళ్లాడినీ నీచులు కాంగేయులు…
  • మీ గురించి తెలుసు కాబట్టే వరుసగా రెండుసార్లు మిమ్మల్ని అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు…
  • కోమటి రెడ్డి, రేవంత్ రెడ్డి మీకు త్వరలోనే ప్రజల చేతిలో భంగపాటు తప్పదని తెలుసుకోండి…

 

విద్యార్థుల సమస్యల పేరుతో నీచ‌ రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ నాయకులు దుష్ట యత్నాలకు దిగుతున్నారు. క‌రోనా సంక్షోభ సమయంలో ఇప్పటికే విలువైన ఆ విద్యా సంవత్సరానికి కోల్పోతున్న‌ ఈ నేపథ్యంలోనే త్వరలోనే విద్యార్థులకు ప్ర‌భుత్వం ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే తప్పేమిటి. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకుని ప్రవేశ పరీక్షలకు సంబంధించి వివిధ తేదీలను ప్రకటించింది. అయితే దీనిపై రాజకీయం చేయాలని కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైన ఎన్ఎస్యూఐ విద్యార్థి నేతలు ప్రగతి భవన్ ముట్టడి అనే దుస్సాహ‌సం చేశారు.

ఈ నేపథ్యంలో సహజంగానే వాళ్లను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇప్పుడు ఈ విద్యార్థుల పట్ల ఆ కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నడు. అరే కోమటిరెడ్డి నీకు ఇంత కూడా బుద్ధి  ఉందా లేదా అని అస‌లు అర్థమవుత లేదు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ప్రవేశ పరీక్షలను తెలంగాణ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అనేక జాగ్రత్తలను ప్రభుత్వం తీసుకోనుంది. కరోనా వైరస్ తో సహజీవనం చేయక తప్పని పరిస్థితి నెలకొంది క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది.


విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించకుండా దీనిపై కూడా నీచ రాజకీయాలు చేయాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకులను చీరి చింత‌కు కట్టి తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. ఇక ఆర్థిక ఉగ్రవాది తెలంగాణ బుడ్డర్ఖాన్ రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యల పట్ల మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. సాధారణ పెయింటర్ నుంచి ఈరోజు రాజకీయ నాయకునిగా వేల కోట్లకు ఎదిగిన నువ్వు నీతులు మాట్లాడటం సిగ్గుచేటు. కాంగ్రెస్ నేతలకు విద్యార్థుల భవిష్యత్తు పై ఎలాంటి బెంగ లేదని ఇప్పటికే ఎన్నో సార్లు రుజువైంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును వదులుకొని బలిదానాలు చేస్తే నాడు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండి పదవులని ప‌ట్టుకు వెళాడిన నీచులు కాంగ్రెస్ పార్టీ వాళ్లు. అందుకే కదా తెలంగాణ ఏర్పాటు తర్వాత వాళ్ళకు గుండు కొట్టి వరుసగా రెండు ఎన్నికల్లో చిత్తుగా ఓటమి పాలు చేశారు. అయినప్పటికీ బుద్ధి తెచ్చుకో కాకుంటే మిమ్మల్ని మీ పార్టీ ని బొంద పెట్టి బంగాళాఖాతంలో కలుపుతారు అని తెలుసుకోండి హౌలే గళ్లారా. తస్మాత్ జాగ్రత్త.