కరోనా నేపథ్యంలో సందట్లో సడేమియాగా ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తున్న వెలుగు పత్రిక.

353
0
  • కరోనా నేపథ్యంలో సందట్లో సడేమియాగా ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తున్న వెలుగు పత్రిక. 
  • ఎప్పుడూ రద్దీగా ఉంటూ తెలంగాణకే తలమానికం అయిన మెట్రో రైల్ కు సైతం కరోనా సెగ  అంటించే ప్రయత్నం. 
  • తెలంగాణ ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న వెలుగు. 
కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న తీరుగా ఉంది వెలుగు పత్రిక తీరు. ఓవైపు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కరోనా వ్యాధి కి సంబంధించిన నివారణ పద్ధతులు పాటించేలా మంచి అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో ఒక యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తూ ఉంటే మరోవైపు దీన్ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో వెలుగు పత్రిక సందట్లో సడేమియా కథనాలు చేస్తుంది.ప్రజల్లో లేనిపోని అనవసరమైన భయబ్రాంతులకు గురి చేసి వాళ్ళను చిత్రవధ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న వెలుగు పత్రిక చివరికి సాధించేది ఏమీ లేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ తో నిర్మించబడిన హైదరాబాద్ మెట్రో రైలు తెలంగాణ ప్రాంతానికి తలమానికంగా ఉంది. నిత్యం రద్దీగా ఉంటూ లక్షల మంది ప్రయాణీకులను తమ తమ గమ్యస్థానాలకు చేరుస్తూ ఎన్నో అవార్డులను గెలుచుకున్న మెట్రో వ్యవస్థ పై వెలుగు పత్రిక  సిగ్గుమాలిన కథనాలు చేస్తూనే ఉంది.నిజానికి కరోన నేపథ్యంలో మెట్రో వ్యవస్థ ఇంకా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.. సరైన శానిటేషన్ పద్దతులు పాటిస్తూ అత్యుత్తమంగా పనిచేస్తోంది..నిజానికి కరోన నేపద్యంలోను మెట్రోకు జనాల తాకిడి తగ్గలేదు అయినప్పటికీ వెలుగు పత్రిక మాత్రం అసత్యాలు ప్రచురిస్తోంది.
తెలంగాణ ప్రాంతంలో ఉంటూ తెలంగాణ ప్రజల చెడు కోరే ఇటువంటి పత్రికలు నిజంగా తెలంగాణలో ఉండడం ప్రజలు చేసుకున్న దురదృష్టం. వెంటనే ఇటువంటి ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తున్న వెలుగుపత్రికను బాన్ చేయవలసిందిగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here